చించినాడ గోదావరి బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను కాపాడిన పశ్చిమ
Автор: Mana Bhimavaram
Загружено: 2025-10-24
Просмотров: 125
పత్రికా ప్రకటన
పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం,
భీమవరం.
చించినాడ గోదావరి బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను కాపాడిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సిబ్బంది......
భీమవరం ప్రాంతానికి చెందిన ఒక మహిళ వీరవాసరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకున్న సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో, గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఆమె చించినాడ బ్రిడ్జి వద్దకు చేరుకుని గోదావరి నదిలోకి దూకడానికి ప్రయత్నించారు. అదే సమయంలో, NH-216 పై హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు హోంగార్డు పిల్లి శ్రీనివాస్ ఆ దృశ్యాన్ని గమనించారు. ఆయన వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి, ఆమె దగ్గరకు వెళ్లి, బ్రిడ్జిపై నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆమెను చాకచక్యంగా అడ్డుకుని, సురక్షితంగా రక్షించారు.
అనంతరం, హోంగార్డు శ్రీనివాస్ ఈ విషయాన్ని సదరు మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునే వరకు ఆమెను అక్కడే ఉంచి, ధైర్యం చెప్పారు. అనంతరం, ఆమెను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.
చాకచక్యంగా వ్యవహరించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన హోంగార్డు పిల్లి శ్రీనివాస్‌ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. #bheemavaram #peace #manabhimavaram #2025 #telugu #
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: