భక్తియుతముగా మాఘమాస "శ్రీగిరి గిరిప్రదక్షిణ"
Автор: RRG J CHANNEL
Загружено: 2026-01-22
Просмотров: 87
భక్తియుతముగా మాఘమాస "శ్రీగిరి గిరిప్రదక్షిణ"
— పల్లకిలో "శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి".
ఒంగోలు::
మఖ నక్షత్రం తో కూడిన ఈ మాఘమాసం మహావిష్ణు కు ఎంతో ప్రీతీయిన మాసం, మాఘమాసం లో సూర్యోదయమునకు మునుచేసే స్నానాలకు శ్రేష్టమైనదని, ప్రతి ఒక్కరు ఇలాంటి మాఘమాసంలో సామూహికముగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం రోజున శ్రీ గిరి గిరిప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమైన రోజని శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. అదీ మాఘశుద్ధ విదియ రోజున ప్రపంచానికి అహింస, త్యాగం, ప్రేమ, సహకారాలను తెలిపిన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి నిజరూప దర్శనం (ఆత్మార్పణ) రోజున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులదే అసలైన అదృష్టవంతమైన జీవితమని వివరించారు.
మాఘశుద్ధ విదియ శ్రవణా నక్షత్రమును సందర్భంగా జనవరి 20వ తేదీ మంగళవారం శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా భక్తియుతంగా జరిగినది, పెద్దసంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు.
స్థానిక బాపూజీ గోశాలలో గోపూజ నిర్వహించుకుని పల్లకిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలను భుజాలపై మోస్తూ ఊరేగింపుగా మంగళ వాయిద్యముల నడుమ స్వామివారి నామ సంకీర్తనలు పాడుచూ కోర్టు సెంటర్ గ్రంథాలయం, కేశవ స్వామిపేట, భగీరథ మందిరం, శర్మ కాలేజ్ గ్రౌండ్, సీతారామ పురం, గద్దలగుంట మీరుగా శ్రీహరి స్వామివారిని దర్శించుకున్నారు.
కార్యక్రమములో శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహా కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు ధనిశెట్టి రామునాయుడు సునీత దంపతులు, నడిపినేని శివ ప్రసాద్, నడిపినేని. చిరంజీవి, వినయ్ కుమార్, హిమ బింద, కనమర్లపూడి కౌశిక్, కిరణ్ కుమార్ వరలక్ష్మి దంపతులు, సినిగేపల్లి నాగాంజనేయులు, సెనగపల్లి కిషోర్, భూమా శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
RRG J CHANNEL
20 జనవరి 2026
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: