మరణము నన్నేమి చేయలేదు | Sis. Keerthana & Sankeerthana | Return To Christ
Автор: Return to Christ
Загружено: 2024-03-20
Просмотров: 943
మరణము నన్నేమి చేయలేదు | Sis. Keerthana & Sankeerthana | Return To Christ
#lyrics
మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: