DEVUNI SPARSHA

ఎపఫ్రా మినిస్ట్రీస్ (దేవుని స్పర్శ యూట్యూబ్ చానల్) గురించి .....
బ్రదర్ ఎపఫ్రా గారు 1998 లో ఇద్దరికి క్రీస్తు ప్రేమను బోదించుట ప్రారంభించి, దైవ చిత్తానుసారముగా 2004 లో ఎపఫ్రా మినిస్ట్రీస్ ను స్థాపించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆరాధనలు, సువార్త సభల ద్వారా అన్యులు ,నామకార్ధపు అనుభవములలో ఉన్నవారిని దేవుని రాజ్యము కొరకు సిద్దపరచుచున్నారు.క్రీస్తు గురించి బోధించుట మాత్రమే కాదు గాని,బోధించిన దాని ప్రకారం జీవించడం ద్వారా అనేకులను క్రీస్తు వైపునకు ఆకర్షించగలమని,ఈ భూమి మీద మనము జీవిస్తున్న ఒక్క జీవితమును ప్రభుకు సమర్పించి,ఆదర్శప్రాయంగా జీవించమని ప్రోత్సహిస్తూ ఉంటారు.
పరిచర్యలో ప్రకటిస్తున్న బోధలు విని అనేకులు తమ దుర్వ్యసనములను,పాపపు మార్గములను విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించాలనే తపన కలిగి ఉన్నారు. వీరిలో అనేకులు పరిచర్యను తమదిగా భావించి,తమ ధనమును,సమయమును వ్యయపరుస్తూ పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉన్నారు.వీరు ఐక్యతతోను,ప్రేమతోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ చివరికి ప్రాణమును కూడా లక్ష్య పెట్టక దేవుని పరిచర్యను కొనసాగించాలనే తపన కలిగి ఉన్నారు.