పచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2020-11-15
Просмотров: 420644
High Nutrient Mixed Cattle Fodder without the need for feeding
దాణా అవసరం లేకుండా పశువులకు పచ్చిగడ్డి మేపుతోనే మంచి ఫలితాలు
లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో అద్భుత ఫలితాలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండల, కాజా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్ము శ్రీనివాస రెడ్డి, డెయిరీ రంగంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను దృష్టిలో వుంచుకుని సరికొత్త ఆలోచనకు తెరతీసారు. లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల పేరుతో దాణా అవసరం లేకుండా 10 లీటర్ల పాలిచ్చే పశువులను లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో సులభంగా మేపవచ్చని ప్రయోగాత్మకంగా రుజువుచేసారు. ప్రస్థుతం రైతులు ఒకటి రెండు పచ్చిగడ్డి రకాలను పశువులకు మేపుతున్నారు. దీంతో పశువులకు అవసరమైన పోషకాల కోసం దాణాను తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తోంది. అయితే శ్రీనివాస రెడ్డి దాదాపు 16 రకాల పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పప్పుజాతి గ్రాసాలను ఈ లవణభరిత పశుగ్రాసంలో ఉపయోగించారు. శరీర బరువునుబట్టి పాడి పశువులకు అవసరమైన కార్బోహైడ్రేట్ లు, మాంసకృతులు, ఖనిజ లవణాలను పశుగ్రాలతో భర్తీ చేస్తూ, పూర్తిగా పశుగ్రాసాలతో మేపు చేపట్టవచ్చని నిరూపించారు. మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్ కు చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య సూచనలతో ఈ నూతన గ్రాసం ఆలోచనకు బీజం పడింది. వివిధ డెయిరీ ఫారాల్లో ఈ గ్రాసాన్ని పరిక్షించి, ఫలితాలు సంతృప్తికరంగా వున్నాయని గమనించాక, చుట్టు పక్కల రైతులకు ఈ గ్రాసాన్ని చేరువ చేసేందుకు శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పాల దిగుబడి, వెన్న శాతం పెరగటం, రైతుకు శ్రమ ఖర్చు తగ్గటం వంటి సానుకూల అంశాలు, పశు పోషకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల కోసం చిరునామా...
శ్రీనివాస రెడ్డి
కాజా గ్రామం
మంగళగిరి మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం: 8142227755
#karshakamitra #Dairyfarming #highnutrientcattlefeed
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: