ధనుర్మాసం ఐదవ రోజు తిరుప్పావై ఐదవ పాశురం అర్థం వివరిస్తూ అందమైన పాట
Автор: VC Vlogs
Загружено: 2025-12-19
Просмотров: 742
దామోదరు శుభ నామములే
ప్రేమతొనందరు పాడవలే
మాధవునందెడి వ్రతమిదిలే
సమతా శాంతిక సాగునులే
హరికి లేరెవరు సమ ఉజ్జి
మాయా తీతుడు తా తలచి
జగములు మాయతొ నేర్పరచి
నంద బాల రూపముదాల్చి
ఉత్తర మధురకు నేతెంచి
దివ్య చేష్టలతొ మురిపించి
నాయకుడై సరి నడిపించి
లోతైన శుద్ధ జలరాశి
యమునా తీరమె తావునికి
గోప కులమునకె ఘనజ్యోతి
మంగళ దీపపు మహాకృతి
యశోద మాత గర్భద్యుతి
సర్వ సులభ పర సత్వభృతి
తాడుతొ నడుముకు కట్టబడి
దామోదరుడను పేరువడి
తలువ కర్మముడి వీడువడి
లీలా చేష్టల గారడీ....
చేసెడి క్రిష్ణుని మది నెంచి
పవిత్రబుద్ధితొ దర్శించి
పరిశుద్ద పూల నర్పించ
భక్తితొ అంజలి ఘటియించ
మాటతొ మహిమలు కీర్తించ
మనసార హరిని ధ్యానించ
మన వ్రతమీ విధి సాగించ
అగ్నిలో పడిన దూది వలె
ప్రారబ్ధ కర్మ పోవునులే
పూర్వ కర్మలగు భస్మములే
ఆగామి కర్మ అంతములే
పాప కర్మ లను పోద్రోలే
దామోదరుశుభనామములే
ప్రేమతొనందరు పాడవలే
మాధవు నందెడి వ్రతమిదిలే
సమతా శాంతిక సాగునులే
సమతా శాంతిక సాగునులే
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: