ధనుర్మాసం ఏడవ రోజు తిరుప్పావై ఏడవ పాశురం అర్థం వివరిస్తూ అందమైన పాట
Автор: VC Vlogs
Загружено: 2025-12-21
Просмотров: 89
సర్వలోకముల హితము కని
ఆనందమందు వ్రతము కని
లేవని వారిని లేపుకొని
అందరినొకటిగ కలుపుకొని
నంద నందనుని చేరుకొని
ఆనందించుటె మనకు పని
పలు చోట్ల నుండి చేరుకొని
భరద్వాజ పక్షులు అన్నీ
తెల్ల వారగనె కలుసుకొని
పగలంతా విడిపోదుమని
ఏవేవో మాట్లాడుకొనే
ఆ మాటలలో మధుర ధ్వని
పడలేదా యది నీచెవినీ
పడలేదా యది నీచెవినీ
ఓ పిచ్చి దాన ఇది యేల
పూలు చెదరసు వాసనల
కేశంబులు గల గోపికలు
ఐదు లక్షల గృహములలో
పెద్దనైన కవ్వంబులతో
బాణలను బోలు కుండలలో
పెరుగు గడ్డలను చిలుకుటతో
కంఠాభరణపు కదలికలు
చేతుల గాజుల గలగలలు
కలసి చెలరేగి దివి చేరే
అందమైన ఆ మధుర ధ్వని
పడలేదా అది నీ చెవినీ
నాయకురాలా వినుమిది
విశ్వపదార్థంబులలో
విరిసిన వాత్సల్యముతో
వ్యాపించిటు యుండునట్టి
వరదుడు నారాయణుడే
అన్నియు తానై యుండీ
అట్టె మనకు కనిపించగ
ఆకృతి దాల్చిటు మనకై
అందపు శ్రీకృష్ణుడుగా
అవతరించి విరోధులను
అంతము చేసిన ప్రభువును
ఆర్తితొ కీర్తించ వినియు
ఆనక పడుకొనియుంటివ
అమలపు నీ తేజస్సిదె
అగుపించుచునుండె మాకు
అడ్డగింపకుము మేమది
అట్టే దర్శించి యెపుడు
అనుభవించినట్లుగాను
అనువుగ తలుపును తెరువుము
వ్రతమున మాతో కలువుము
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: