Ni Ventha Ne Mentha - Peda Tirumalacharya Sankeerthana (నీ వెంత నే మెంత -పెదతిరుమలాచార్య సంకీర్తన)
Автор: Bijjam Brothers
Загружено: 2025-12-18
Просмотров: 695
నీ వెంత నే మెంత - పెదతిరుమలాచార్య సంకీర్తన (Ni Ventha Ne Mentha - Peda Tirumalacharya Sankeerthana)
Singer - Pavan Charan garu; Composer - Saluri Vasu Rao garu during Annamayya Paataku Pattabhishekam Program by SVBC & TTD
Ragam - Hamsadhvani
Lyrics -
నీ వెంత నే మెంత నీ కృప యెంచుట గాక
భావింప స్వతంత్రుఁడవు పరమేశ్వరుఁడవు
సాదించరానివాఁడవు సకలోపాయములను
సాదించరానివాఁడవు చొచ్చి వెదకి
సాదించరానివాఁడవు వాకుచ్చి యెవ్వరికిని
పాదుకొనఁ గొలిచితే భక్తసులభుఁడవు
మించరానివాఁడవు మేటిసురలకు నైనా
యెంచరానివాఁడవు యిట్టట్టనుచు
వంచరాని వాఁడవువడిఁ బ్రతాపములను
పంచనుండి నుతించితే భక్తసులభుఁడవు
పట్టరానివాఁడవు బలిమి నేరుపులను
ముట్టరానివాఁడవు మొక్కలానను
నెట్టన శ్రీవేంకటేశ నీ వెదుట నున్నాఁడవు
బట్టబయలు మొక్కితే భక్తసులభుఁడవు
భావమాధుర్యం :
పెదతిరుమలయ్య చెప్పిన భక్తిరస ప్రధానమైన కీర్తననాస్వాదించండి. ప్రభూ! నీవెంతటి దేవదేవుడవు, మేమెంతటి మానవాధములము? నీకృప నాశించుట తప్పించి, సర్వస్వతంత్రుడవైన పరమేశ్వరుడవు నీకు మాకు సాపత్యమేమున్నది? సర్వోపాయములచేత సాధింపరానివాడవు. ఏచోట వెదకినా సాధింపరానివాడవు. వీరిని వారిని వాకబు చేసి యెన్నటికీ సాధింపరానివాడవు. స్థిరనిశ్చయంతో కొలిచిన భక్తులకు మాత్రమే సులభ సాధ్యుడవు. ఉన్నతులైన దేవతాప్రముఖులచేత కూడా మించబడనివాడవు. ఇటువంటివాడు, అటువంటివాడు అని విశ్లేషించబడని వాడవు. ఎటువంటి ప్రతాపము చేతనైనా అణచబడని వాడవు. కాని తామున్నచోటనే వుండి నిరంతరము నిన్ను నుతించే భక్తులకు మాత్రం సులభసాధ్యుడవు. బలవంతంగా గాని, నేర్పరితనము చేతగాని పట్టుబడని వాడవు. శౌర్యము చూపి నిన్ను ముట్టుకొనుటకు సాధ్యముకాదు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీ నిజభక్తులకు ఎదురుగా సిద్ధముగా వుంటావు. కల్మషము లేకుండా మొక్కే భక్తులకు మాత్రం సులభ సాధ్యుడవు.
మొక్కలాన-శౌర్యముతో
ఇట్టిట్టనూచు-ఇటువంటివాడు, అటువంటివాడు అనే
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: