Yeloko Karmama - Annamayya Sankeerthana (ఏలొకో కర్మమా - అన్నమయ్య సంకీర్తన)
Автор: Bijjam Brothers
Загружено: 2025-12-19
Просмотров: 690
ఏలొకో కర్మమా - అన్నమయ్య సంకీర్తన (Yeloko Karmama - Annamayya Sankeerthana)
Singer & Composer - Sri S V Ananda Bhattar garu;
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
Lyrics -
ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని
పాలుపడిన యీ జలభ్రమణమువలెను
ధరలోఁ బుట్టినప్పుడే తలఁచ నీ యాత్మ
మరుగఁడు పరమైతే మరచీఁగాని
అరిది దుర్భాషల నలవడ్డనాలికె
హరినామములయందు నలవడదు
జవకట్టి పూర్వవాసనల సంసారమే
చవియే తాఁగాని ముక్తి చవిగాదు
భువిఁగల విషయాలఁ బుంగుడయ్యీఁగాని మతి
వివరించి దైవమును వెదకలేదు
శ్రీవేంకటేశుకృపచేత నింతేకాని
వావాత నివి గైవశము గావు
భావమిప్పుడితని పాదాలు చేరికాని
యేవుపమలనుఁ గాన మిన్నాళ్లును
భావోద్దేశ్యము :
ఓ నా కర్మమా! ఇందుకు నేనెందుకు పాలైనాను? అనేక భ్రమలకులోనై ఈ జలభ్రమణకు 'సుడిగుండం' పాలుపడితిని? (దీంట్లో చిక్కుకుపోయాను). దీనివలన నీకేమి లాభం కలిగిందే?
తలచన్ (ఆలోచిస్తే) ఈనా ఆత్మ నేను భూమ్మీద పడ్డ క్షణం నుంచే 'పరము' మీద ధ్యాస పోయి, మరుగడు (దానిగురించి ఆసక్తిని వదలివేస్తాడు. ఇక నా నాలుక దుర్భాషనలవరచుకొని పుష్కలంగా పాపం చేయిస్తూనే వుంటుంది. హరి నామము నొకవేళ గత జన్మలో నాకలవాటైనా ఇప్పుడు మఱచిపోతాను.
పూర్వజన్మ వాసనలు జమ అయిపోయి సంసార సుఖముపై రుచి పెరుగుతుంది. ముక్తి రుచించదు. ప్రపంచములోని విషయ సుఖాలమీద అంతులేని “యావ” కలుగుతుంది. దైవమే లేడనే భ్రమ కూడా కలుగుతుంది. అశాస్వతమైనవన్నీ శాశ్వతమనుకొంటుంటాడు జీవుడు. అసలు దైవాన్ని వెదకే ఆలోచనే రాదు.
ఒకే వొక సుకృతమువలన శ్రీవేంకటేశ్వరునికి నీ జీవుడిపై దయ కలుగుతుంది. అంతేకాని మరొక కారణం కనుపించదు. వావాత (నోరారా) హరినామము అలవడుతుంది. భావములో హరిపాదములను స్మరించేశక్తి వస్తుంది. ఇన్నాళ్ళూ ముక్తి వుపమల (పాయములను) మఱచినా, ఇప్పుడు దానిపై ఆసక్తి పెరుగుతుంది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: