VINAVE VIBHUNIMATA - Annamayya Sankeerthana (వినవే విభునిమాట - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Автор: Bijjam Brothers
Загружено: 2025-11-26
Просмотров: 0
వినవే విభునిమాట - అన్నమయ్య సంకీర్తన (VINAVE VIBHUNIMATA - Annamayya Sankeerthana)
Singer - G Balakrishna Prasad garu; Composer - Smt. P Susheela garu
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
Ragam - Hindolam
Lyrics -
వినవే విభునిమాట వింతదానవా
చెనకేటి వేళనింత సిగ్గులు వడుదురా
యీసు లేని వాఁడతఁడు యిచ్చకురాలవు నీవు
తాసులవంటివే నీతలఁపు లెల్లా
సేస వెట్టినాఁడతఁడు చేయివట్టితివి నీవు
వాసులకు నీవుతల వంచుకొందువా
సరసపు వాఁడతఁడు చాయకు వత్తువు నీవు
సరిబేసి వంటివే మీచనవులెల్లా
తెరవేసినాఁడతఁడు తిరమై నిలిచితివి నీవు
శిరసువంచుక నీవు చెక్కు చేతనుందువా
శ్రీ వేంకటేశుఁడతఁడు శ్రీమహలక్ష్మీ నీవు
పూవు వాసనవంటివే బుద్ధులెల్లా
భావించి కూడెనతఁడు పైకొంటి విట్టెనీవు
తావుల రతుల నిట్టే తమకింతురా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: