Thotakura Dongalala - China Tirumalacharya Sankeerthana (తోఁటకూరదొంగలాల - చినతిరుమలాచార్య సంకీర్తన)
Автор: Bijjam Brothers
Загружено: 2025-11-18
Просмотров: 838
తోఁటకూరదొంగలాల - చినతిరుమలాచార్య సంకీర్తన (Thotakura Dongalala - China Tirumalacharya Sankeerthana )
Singer - Hemachandra garu; Composer - Sai Madhukar garu during Annamayya Paataku Pattabhishekam Program by SVBC & TTD
Lyrics -
తోఁటకూరదొంగలాల తొయ్యలులాల
నాఁటకపు మీమోహము నమ్మ నెట్టువచ్చును
పాపపుణ్యపుటోఁదాలపాలు సేసి జీవులను
చూపలనె భ్రమయించే సుద్దులు మీవి
దాపుదండై శ్రీవిభుఁడు తానె కాచెఁగాక
యేపున రిత్తవారి మీ రెంతంత సేయరు
కీడు మే లనె వురులఁ గీలించి మనుజులఁ
బాడితోనె యెంచెటిభావము మీది
యీడేరించి నాగురుఁడు యిందిరేశుఁ జూపెఁగాక
యీడనె రుత్తవారి మీ రెంతంతసేయరు
చావుఁ బుట్టుగు లనెటి సముద్రాలఁ బడఁదోసి
జీవులను విసిగించేచిత్తము మీకు
శ్రీవేంకటనాథుఁడె చేపట్టి మమ్మేలెఁగాక
వేవేగనఁ బేదలచే వెట్టి యెంతగొనరు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: