30 ఏళ్లుగా నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో రైతు || Asil Country Chicken farming || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-04-03
Просмотров: 217374
Excellent Profits in Asil/Aseel Cross Breed Country Chicken farming.
The Ideal Young farmer success Story in Natu Kodi/Country Chicken farming.
30 ఏళ్లుగా అసిల్/టీకరాలు క్రాస్ బ్రీడ్ నాటుకోళ్లతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతు.
పశుసంపదే మానవుని తొలి ఆస్థి అన్న పెద్దల మాటలను తూ.చ తప్పక అనుసరిస్తూ పాడి పరిశ్రమకు తోడుగా నాటుకోళ్ల పెంపకంతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ రైతు సజ్జా సునీల్ కుమార్. శ్రమ చేయదగిన స్థాయిలో 22 పాడి గేదెలతో డెయిరీని విస్తరించిన ఈ యువ రైతు, 200 కోళ్లకు పైగా అసిల్ నాటు కోళ్లను పెంచుతున్నారు. పెట్టలను డెయిరీ వద్ద, పుంజుల ప్రత్యేక జాగ్రత్తల మధ్య పెంచుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. నాటుకోళ్లకు ఎటువంటి షెడ్డు లేదు. రాత్రిపూట చిన్నచిన్న కేజ్ లే వీటి స్థావరం. పగలు గేదెలు బయట మేస్తే, కోళ్లు డెయిరీ షెడ్డు చుట్టూ తిరుగుతాయి. మొత్తం 2 ఎకరాల 20 సెంట్లలో షెడ్డుతపాటు, పశుగ్రాసాలను పెంచుతుండగా, పగలు మొత్తం కోళ్లు ఈ స్థలంలో సంచారంచేస్తుంటాయి.
నెలనెలా కొన్ని కోళ్లను అమ్మటం, నిత్యం గుడ్లను విక్రయించటం ద్వారా ఈయన నెలకు 30వేలకు పైగా నికరలాభం సాధిస్తున్నారు. పశుపోషణతో నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం గడిస్తున్న ఈయనకు కోళ్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం మరింత చేయూతనిస్తోంది. నాటుకోళ్లకు ఇటీవల పెను విపత్తుగా మారిన వైరస్ తెగుళ్లను ఈ రైతు సులభంగా అధిగమిస్తున్నారు. పుంజుల్లో టీకరాల సంకరం అంటే అసిల్ క్రాస్ బ్రీడ్ పెంచటం వల్ల ఈయన దగ్గర మంచి జాతి పుంజులు అభివృద్ధి చెందాయి. నాటుకోళ్లతో నెలకు 30 నుండి 50 వేల నికర లాభం గడిస్తున్న ఈ రైతు, సాటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #asilcountrychicken #aseelnatukodifarming
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: