స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం
Автор: Veda Vani
Загружено: 2025-01-28
Просмотров: 335
స్వయంగా స్కందుడు చెప్పిన సంపూర్ణ స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం
Skandapuran by Pujya Sri vaddiparthi padmakar garu
ఓం శ్రీ మహా గణపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ కృష్ణాయ గోవిందాయ నమః
జై శ్రీరామ్ ,🙏🙏🙏
ఏవి తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకో వలసన పని లేదో అవే వేదాలు అటువంటి వేదాలను, వేదాలలోని సారాన్ని పురాణాలుగా మనకి అందించారు.
కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు.
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అందరికి వేద పారాయణం లేదు.వేదం పారాయణ చేయాలి అంటే గొప్ప నిష్ఠగా గరిష్టిలు కావాలి. కలియుగంలో అంతా నిష్ట కలిగిన వారు కొందరే ఉన్నారు. కాని వేదాలను అందరూ తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచించి వ్యాసుడు వేదాలలో ఉన్న సారాన్ని అంతటిని ఇలా మనకి 18 పురాణములు,18 ఉప పురాణాల రూపంలో ఇచ్చాడు. వాటిల్లో ఒకొక్క దానిలో కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి. కలియుగం లో మానవుల ఆయుర్దాయం తక్కువ కాబట్టి ఇంత పెద్ద పురాణములను అందరూ తెలుసుకోవాలి అంటే వ్యాసుడు వీటిని కుదించి వేల శ్లోకాల్లో కి తెచ్చారు. ముఖ్యంగా అష్టాదశ పురాణములు అందరికీ తెలియాలి. అందరూ తెలుసుకోవాలి. మనం ఈ సనాతన ధర్మం లో పుట్టినందుకు పురాణాలను తెలుసుకోవటం మన భాధ్యత.
కలియుగంలో ఇహపరాలు రెండూ ప్రసాదించి మనల్ని సులభంగా తరింపజేయడమే కాక మన పితృదేవతలకు ఉత్తమలోకప్రాప్తి కలిగించి వారి శుభాశీర్వాదాలను మనకు అందించడంతో పాటు శ్రీకృష్ణ దివ్యానుగ్రహఫలాన్ని విశేషంగా ప్రసాదించేదే భాగవతసప్తాహం.
సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయడం, భక్తులను తరింపజేయడమే తమరి లక్ష్యాలుగా అవిశ్రాంతంగా పరితపించే తపస్వులు పూజ్య గురుదేవులు ఎందరో ఉన్నారు.నిరంతరం లోకకల్యాణం కోసం, భక్తుల తరింపజేయడం కోసం వెచ్చించారంటే అటువంటి గురువుల ఋణం తీర్చుకోగలమా...అటువంటి గురువులు, ఋషుల ఋణం తీర్చుకోవాలి అంటే వారు చేప్పిన బాట లో నడుస్తూ వారు రాసిన, చెప్పిన పురాణాలను, ప్రవచనాలను అన్నింటినీ వినాలి, చదవాలి.
ధర్మో రక్షతి రక్షితః
మనం ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన కర్తవ్యం మనం చేయకుండా ఉండడానికి పెద్ద జ్ఞానులం ఏం కాదు. జ్ఞాని అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వారు. వారు అనునిత్యం బ్రహ్మంతో రమిస్తూ ఉండేవారు. వారు చేయకపోయినా చేసిన వారితో సమానం. జ్ఞానిని అనుకరించకూడదు. అజ్ఞానిని కూడా అనుకరించకూడదు. అజ్ఞాని అంటే పిచ్చివాడు. కానీ మనము తప్పనిసరిగా ఆచరించాలి ఎవరికి తోచిన విధంగా వారు ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవాలి.
రామో విగ్రహవాన్ ధర్మః
ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తే లోకంలో మానవుల అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. శ్రీరాముడు, రావణుని ఇద్దరూ జ్ఞానులే. శ్రీరాముడు ఏం చదివాడో, శ్రీరాముడికి ఎంత తెలుసో, రావణుడికి కూడా అదే చదివాడు, అంతా తెలుసు. అయినా రావణుడు తనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ధర్మాన్ని ఆచరించాడు తనకి అనుకూలంగా లేనివి, తనకు నచ్చనివి ఆచరించలేదు. కాని శ్రీరాముడు ఈ లోకానికి తన ధర్మాన్ని ఆచరించి చూపించాడు. అవతారం తీసుకోవలసిన అవసరం లేని ఆ భగవంతుడు మన కోసం అవతారం దాల్చి భూమిపై మానవజన్మ తీసుకుని ఎంతటి కష్టం వచ్చినా తను ధర్మం తప్పకుండా ఆచరించి చూపించాడు.ఆ శ్రీ రామున్ని ఆధారంగా చేసుకుని మనం మనం మన ధర్మాన్ని తప్పకుండా పాటించాలి.
జై శ్రీరామ్ 🙏
బలం గురోః ప్రవర్థితాం.🙏🙏🙏
బలం విష్ణోః ప్రవర్థితాం
బలం గురోః ప్రవర్థితాం.🙏🙏🙏
please 🤌 share n sprread 🗣️ sanathan dharam in the 🌎 world.
🙏thank you for watching,🌞
please like💗👍, share, subscribe n comment✍️🙏🙏🙏 🌷
#skandapurana#skanadapuranam#kumaraswamy#murugan#saravanan #subrahmanya #skanda#skandmata#hacks #lifehacks #vedavani
#spiritualspiches#sanatanlife#pravachanam #pravachan #pravachantelugu #telugu#rama#hanuman #anjane#sitaram #sita #ramayanam #ramayan #dharma #inspiration #bhagavadgita #sanatan #motivation #dharmiclife #hindhu #bhakthi #shiva
#sanatani#sanatanadharma#dharmik #dharmiclife #hindhu #hinduism #sanatandharm #amma #amman#maa #maadurga #maakali #maalaxmi #maasaraswati#shivpuja #narayan #mata #maalalitha#lalithamma #lalitha #devotionalife #devotinal #inspirational #motivational #padmapuran #padmapuranam#vaddipartipadmakar #vaddiparthi #vaddiparthipadmakar #vaddipartipadmakargaru
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: