Veda Vani

Enjoy the spiritual words from puranas
ఏవి తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకో వలసిన పని లేదో అవే వేదాలు అటువంటి వేదాలను, వేదాలలోని సారాన్ని పురాణాలుగా మనకి అందించారు.
కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అందరికి వేద పారాయణం లేదు.వేదం పారాయణ చేయాలి అంటే గొప్ప నిష్ఠగా గరిష్టిలు కావాలి. కలియుగంలో అంతా నిష్ట కలిగిన వారు కొందరే ఉన్నారు. కాని వేదాలను అందరూ తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచించి వ్యాసుడు వేదాలలో ఉన్న సారాన్ని అంతటిని ఇలా మనకి 18 పురాణములు,18 ఉప పురాణాల రూపంలో ఇచ్చాడు. వాటిల్లో ఒకొక్క దానిలో కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి. కలియుగంలో మానవుల ఆయుర్దాయం తక్కువ కాబట్టి ఇంత పెద్ద పురాణములను అందరూ తెలుసుకోవాలి అంటే  వ్యాసుడు వీటిని కుదించి వేల శ్లోకాల్లోకి తెచ్చారు. ముఖ్యంగా అష్టాదశ పురాణములు అందరికీ తెలియాలి.మనం ఈ సనాతన ధర్మం లో పుట్టినందుకు పురాణాలను తెలుసుకోవటం మన భాధ్యత.
ధర్మో రక్షతి రక్షితః
రామో విగ్రహవాన్ ధర్మః
జై శ్రీరామ్#dharma#vedavani