పాము కాటుకి నాటు వైద్యమా? నేటి వైద్యమా? // Pamukatuki natu vaidyama? Neti vaidyama? // Video - 6
Автор: Dr DRK PRASAD
Загружено: 2022-07-30
Просмотров: 3551
ఈ వీడియోల ఉద్దేశం పాము కాటు మరణాలను ఆపడం.
-------------------------------------------------------------------------------------------------------------------------------
పాము కాటుకు గురైన వ్యక్తికి ఆసుపత్రిలో జరిగే వైద్యం
కొన్ని ఇతర వైద్యాలతో పోల్చినప్పుడు ఇది సంక్లిష్ట వైద్యమేమి కాదు.
రోగికి ధైర్యం నూరిపోస్తూ, ఆస్పత్రిలో ఎడ్మిట్ చేసుకోవాలి.
నోటి గుండా ఆహారమేమీ ఇవ్వకూడదు.
అత్యసరమైన మందులు ఇవ్వడం కోసం, ఆహారం కోసం సెలైన్ ఎక్కిస్తూ ఉండాలి (Lifeline).
Pulse, BP, Oxygen Saturation చూసుకుంటూ ఉండాలి.
ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్తగా టెట్వాక్ యింజక్షన్ చేయాలి (గతంలో వేయించుకోని వారికి).
అవసరమయిన రక్త పరీక్షలు చెయ్యాలి(Clotting Time మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం రావచ్చు)
రోగిని పరిశీలిస్తూ విషప్రభావం కనిపించినపుడు ఏ.ఎస్.వి. ఇంజక్షన్లు చేయాలి.
విష లక్షణాలేవీ కనిపించకపోతే 24 గంటల తర్వాత రోగిని ఆస్పత్రి నుంచి పంపించివేయవచ్చు.
పాము కరిచిన చేతికో, కాలికో ఒక్కోసారి చీము పట్టవచ్చు. అప్పుడు అవసరమనుకొంటే డాక్టర్ అక్కడ ఒక కోత పెట్టి చీము తొలగిస్తాడు.
ఎప్పుడైనా రక్తపింజర విషం వల్ల మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోతే (Serum creatinine పెరగడం, Urine తక్కువగా రావడం) నెఫ్రాలజిస్టు (మూత్ర పిండాల వ్యాధుల నిపుణులు) వద్దకు పంపిస్తారు.
త్రాచు పాము గానీ, కట్ల పాము గానీ కరిచినపుడు ఊపిరి ఆగిపోతూ ఉంటే గొంతులో గొట్టం వేసి (Intubation) ventilator కు connect చేయవలసి ఉంటుంది.
మెదడులో రక్త స్రావమై Comaలోకి వెళితే (అపస్మారకంగా ఉంటే) న్యూరాలజిస్టు (మెదడు, నరముల వ్యాధుల నిపుణులు) వద్దకు పంపుతారు.
ఐతే ప్రాధమిక వైద్యునికి Nephrologist కో, Neurologist కో పంపవలసిన అవసరాలు నూటికి ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే వస్తాయి.
ఆసుపత్రికి వచ్చేటప్పటికే Brain death వస్తే తప్పితే పై వైద్యంతో నూటికి 99 పాము కాటు మరణాలను ఆపవచ్చు.
******
నాటు వైద్యం గురించి
నాటు వైద్యుల నెప్పుడూ విమర్శించలేదు.
నాటు వైద్యాన్ని ఎప్పుడూ సమర్ధించలేదు.
కారణం :
పాముకాటు కేసులలో నాటు వైద్యం కోసం ప్రయత్నించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే!
నాటు వైద్యం కోసం వెళితే అసలు వైద్యం మొదలుపెట్టడం ఆలస్యం అవుతుంది.
సరైన సమయంలో తగినంత మోతాదులో Anti Snake Venom ఇవ్వాలి కదా.
నాటు వైద్యంలో 'నోట్లో పసరు, కళ్ళల్లో కలికం 'వేస్తారు.
పసరు వలన వాంతి అవుతుందో, విష ప్రభావం వలన వాంతి అవుతుందో డాక్టరుకు అర్ధం అవడం ఆలస్యం అవుతుంది.
కళ్ళల్లో కలికం వలన కళ్ళు తెరవలేరు. విష ప్రభావం ఎంతో, కలికం ప్రభావం ఎంతో అర్ధం కావడం కూడా ఆలస్యం అవుతుంది.
అందుకే నాటు వైద్యం వద్దు అని గట్టిగా చెప్పడం.
...
నాటు వైద్యులను నేను ఎప్పుడూ విమర్శించలేదు. విమర్శించను కూడా!
ఎందుకని? :
మొట్ట మొదటి సారి ASV తయారు చేసింది ఫ్రాన్సులో1895 లో.
1927 లో USA లో మార్కెట్ లోకి ASV వచ్చింది.
1950 తర్వాతే ఎక్కువగా వాడకం లోకి ASV వచ్చింది.
కాబట్టి ASV చరిత్ర 125 సంవత్సరాలే!
మరి అంతకముందు లక్షల సంవత్సరాల నుండీ మనుష్యులు పాము కాటుకి గురి అవుతూనే ఉండే వారు కదా! అప్పట్లో వారికి తోచిన, తెలిసిన వైద్యమేదో చేసుకుంటూనే ఉన్నారు. తాత ముత్తాతలు చెప్పిందో, వారి అనుభవం లో నుంచి నేర్చుకొన్న అంశాలనో పాము కాటు వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
పాము కాటుకు నాటు వైద్యం చేసే వారిలో ఎక్కువ భాగం ప్రతిఫలం తీసుకోరు. తీసుకోగూడదనే నిష్ట కలిగిన వారు కూడా ఉంటారు. అది ఒక సేవ గానూ, తమకు తెలిసిన విద్యను పదిమందికి ఉపయోగపడాలనే భావిస్తారు.
అతి కొద్ది మంది మాత్రమే చిరు సేవల్ని రోగుల నుండీ పొందుతారు. వీరి వైద్యం వలన రోగులకు 'ధైర్యం 'వస్తుంది.
విషం లేని పాముకాటుల వారు అందరూ బ్రతుకుతారు. విషపు పాములు కరిసినా 30 – 50 శాతం ఉత్తుత్తి కాటులే కదా! వీరూ బ్రతుకుతారు.
నిజంగా విషం ఎక్కిన కేసులు బ్రతకరు. దాదాపు నూటికి 75 పాము కాటు కేసులు ఏ వైద్యం లేకపోయినా బ్రతుకుతారు. వీరంతా సాంప్రదాయ వైద్యాల చేతిలో కూడా బ్రతుకుతారు. అస్సలు వైద్యం లేదు అనే భావన కన్నా “నేను వైద్యం చేయించుకొన్నాను” అనే భావన ఎంతో 'ధైర్యాన్ని' ఇస్తుంది గదా!
అనేక తరాల్నుండీ ప్రపంచంలో సాంప్రదాయ వైద్యులు పాము కాటు కు వైద్యం చేస్తూ ప్రజలకు 'సేవ' చేస్తున్నారు. అందుకే నేనెప్పుడు సాంప్రదాయ పాము కాటు వైద్యులను విమర్శించలేదు. విమర్శించను.
అదే సమయంలో పాము కాటు మరణాలను ఆపాలంటే ఆ వైద్యం వద్దకు పోకూడదు అని ప్రచారం చేస్తాను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: