Alasina Vanini Uradinchu Matalu January 18🫀అలసిన వానిని ఊరడించు మాటలు జనవరి 18🌾అనుదిన ధ్యానములు.
Автор: Tholisaku Vani🌹Vini
Загружено: 2026-01-17
Просмотров: 31
అలసినవానిని ఊరడించు మాటలు
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
DAILY MEDITATIONS FROM THE MINISTRY OF Bro. BAKTH SINGH
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
🌷🌷🌷 Sunday, January 18 🌷🌷🌷
''మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను'' (ఎఫెసీ 1:3).
ఇది దేవుని వాక్యము నందలి ప్రశస్తమైన వాగ్ధానము. జీవముగల మన దేవుడు నిత్యత్వము నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించవలెనను సంకల్పమును కలిగియున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచించబడిన మన మందరము ఈ ఆశీర్వాదములను కోరుకొను ఆధిక్యత కలిగియున్నాము మరియు తరువాత ఈ ఆశీర్వాదములకు మనము ఎట్లు అర్హుము కాగలమో ప్రభువే మనకు బోధించును. మొట్టమొదటిగా, ఇది మనుష్యుని మాట కాదు దేవుని మాటయని మరియు ఇది కేవలము అపొస్తలులకు, దేవుని సేవకులకు మాత్రమే కాదు గాని మనకందరికి వర్తించునని నమ్మవలసియున్నది. ఈ మాటలు ప్రభువునందు విశ్వాసముంచు వారందరికి వర్తించును. నీవు ఎంత బుద్ధిహీనముగా, బలహీనముగా మరియు వికారముగా ఉన్నను నీవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా నిజముగా విమోచించబడితినని చెప్పుచున్న యెడల, ఆ వాగ్ధానమును కోరుకొను ప్రతి యొక్క హక్కు నీకు కలదు. అలాగున మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నియు అనుభవించగలము.
మనము యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తముతో కొనబడితిమి గనుక పరలోక జీవులు లేక దూవదూతల కంటె మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమగుదుము. కావున అట్టి ప్రేమను, రక్షణను అధికముగా అర్థము చేసికొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నియు అనుభవించగలము. మరియు అందుచేతనే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ విశ్వాసుల పక్షముగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటను కనుగొందుము. ''మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను'' (ఎఫెసీ 1:16). ప్రప్రఘమముగా మనము నేర్చుకొనవలసిన విషయము, ఎడతెగక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట. మనము ప్రతిదినము ఇదే విధముగా ఆరంభించవలెను. ''అవును ప్రభువా, నేను బలహీనుడను, బుద్ధిహీనుడను, అయోగ్యుడను మరియు పనికిమాలినవాడను అయినను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నీ దృష్టికి ప్రశస్తమైనవాడను గనుక నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను''.
రెండవదిగా, మనము చిన్న విషయముల కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుటకు నేర్చుకొనవలెను. కొలొస్స 4:2లో ప్రార్థనయందు నిలకడగా ఉండుడని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు. ఎఫెసీ 6:18లో కూడా అదే తలంపును చూచుదుము. ''ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి''.
మూడవదిగా, మనము దైవిక మర్మములను అర్థము చేసికొనుటకు ఎడతెగక దైవజ్ఞానమును కోరుకొనుచుండవలెను. ''మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును'' (ఎఫెసీ 1:17).
నాల్గవదిగా, మన గ్రుడ్డి నేత్రములు తెరువబడవలసియున్నది. ''మీ మనోనేత్రములు వెలిగింపబడెను'' (ఎఫెసీ 1:18). పరలోక విషయములను అర్థము చేసికొనుటకు మనకు పరలోక ప్రత్యక్షత కావలెను. అందుచేతనే మనము ''ప్రభువా, నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా, ఇంకా చూచునట్లు నా కన్నులు తెరువుము'' అని ప్రార్థించవలెను. జ్ఞానులకు, వివేకులకు మరుగుచేయబడిన మర్మములు పసిబాలురకు బయలుపరచబడును, అనగా సామాన్య విశ్వాసము గలవారికి బయలుపరచబడును. మనము దేవుని వాక్యము లోనికి లోతుగా తరచి చూచిన యెడల ఎల్లప్పుడు ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనగలము. ఇది దేవుని వాక్యమే గాని మానవుని మాట కాదు. అది ఎంతో లోతైన బంగారు గని వంటిది. మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలెను. అప్పుడు మనము పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: