SriLaxmichennakeshavaSwamy temple gangapuram/శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం.
Автор: Neti Jeevanam
Загружено: 2021-08-05
Просмотров: 10120
మిత్రులందరికీ నమస్కారం 🙏🙏🙏 నేటి జీవనం యూట్యూబ్ ఛానల్ దైవదర్శనం కార్యక్రమంలో భాగంగా గా అతి ప్రాచీనమైన, పురాతనమైన,అతి మహిమాన్వితమైన క్షేత్రం అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం. ఈ క్షేత్రము క్రీస్తుశకం ఒక వెయ్యి సంవత్సరంలో లో రెండవ చోళరాజు చేత నిర్మించబడినది. ఇక్కడ స్వామి వారు చెన్నకేశవ స్వామి రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీ చెన్నకేశవ స్వామి అవతారం విష్ణు అవతారం. స్వామి వారు గజేంద్రమోక్షం సమయాన కేశి అనే రాక్షసున్ని సంహారం చేసినందుకు గాను స్వామివారికి చెన్నకేశవ స్వామి అనే నామం వచ్చింది. ఈ గంగాపురం క్షేత్రంలో చెన్నకేశవ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడికి భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారికి నైవేద్యం వండి దాసింగం (నైవేద్యం) పెట్టి తమ తమ కోరికలు చెప్పుకుంటారు. స్వామి వారు భక్తుల పెట్టే నైవేద్యం ఆరగించి వారి కోరికలను తీరుస్తారని భక్తుల విశ్వాసం. కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. 🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: