నోబెల్ గ్రహీత - ఉపనిషత్ కథ | T S Eliot | The Waste Land Poem | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2024-10-28
Просмотров: 8271
ఇరవయ్యవ శతాబ్దపు అత్యుత్తమ కవులలో ఒకరు టి. ఎస్. ఎలీయట్. డెభ్బై ఆరేళ్ళు జీవించిన ఈ మహారచయిత తన రచనలతో ప్రపంచ సాహిత్యం మీద చెరగని ముద్ర వేశారు. తన అరవయ్యవ ఏట నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. ఆధునిక సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఎలీయట్. కేవలం సాహిత్యరంగంలోనే కాదు, విజ్ఞానం, తత్త్వం, తర్కం, చరిత్ర ఇలా విభిన్నరంగాలలో ఆయనకున్న ప్రతిభ అసాధారణమయ్యింది. ఎలీయట్ గొప్ప విమర్శకుడు కూడా. ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం గురించి జరిగే చర్చల్లో ఎలీయట్ అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవడం పరిపాటి.
అంతటి ప్రభావశీలుడైన ఎలీయట్‌పై భారతీయ సాహిత్యప్రభావం ఎంతో ఉంది. ఆయన భగవద్గీతను ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. రెండేళ్ళ పాటూ సంస్కృత భాషను, సంవత్సర కాలం పాటు పతంజలి యోగాను నేర్చుకున్నారు. ఆనాటి ఆ అధ్యయనాలవల్లే ఈనాటికీ నాలో ఆధ్యాత్మిక చైతన్యం తొణికిసలాడుతోందని వర్జీనియా యూనివర్శిటీలో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో చెప్పారు. ఆ ఉపన్యాసాల సంకలనం ఆఫ్టర్ స్ట్రేంజ్ గాడ్స్ - ఏ ప్రైమర్ ఆఫ్ మోడర్న్ హెరసీ అనే పేరుతో పుస్తకంగా కూడా ప్రచురించబడింది. అలానే తనపై, తన కవిత్వంపై భారతీయ తత్త్వశాస్త్ర ప్రభావం ఎంతగానో ఉందని Notes Towards the Definition of Culture అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. “సునిశిత బుద్ధి కలిగిన భారతీయ తత్త్వవేత్తల ముందు ఉత్తమస్థాయి ఐరోపా తత్త్వవేత్తలంతా బడిపిల్లల్లా కనబడతార”న్న అయన మాటలు భారతీయ తత్త్వశాస్త్రంపై ఆయనకున్న అవగాహనను, విశ్వాసాన్ని తెలియజేస్తాయి.
ఇక ఎలీయట్ రచనల్లో ఎంతో గొప్పదిగా చెప్పబడే రచన.. The Waste Land అనే నాలువందల ముప్పై మూడు లైన్ల కవిత. ఈ కవితను మించిన కవిత ఇంగ్లీషు సాహిత్యంలో 20వ శతాబ్దం మొత్తంలోనే రాలేదనన్నది ఎంతోమంది విమర్శకులు అంగీకరించిన విషయం. ఐదు అధ్యాయాలుండే ఈ వేస్ట్ ల్యాండ్ కవిత పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రచురితమయ్యింది. ఎలీయట్ ఈ కవిత వ్రాయడానికి ఒక కారణం ఉంది. మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక, ఐరోపా ఖండంలో పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఐరోపా సమాజం పతనం అంచున నిలబడింది. తన సమాజ దుస్థితిని చూసిన ఎలీయట్ కవిహృదయం ద్రవించిపోయింది. అలా The Waste Land అనే కవిత పుట్టింది. ఆనాటి సమాజంలోని పెనుపోకడల్ని మార్మికమైన రీతిలో సూచిస్తూ, ఆధునిక మానవుడు తిరిగి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా పునరుజ్జీవితుడు కావాలన్న ఆకాంక్షతో ఈ కవితను వ్రాశారు ఎలీయట్. అత్యంత సంక్లిష్టంగా ఉండే ఈ కవితలోని భావాలకు ఎంతోమంది విమర్శకులు అనేక విశ్లేషణలు చేశారు. ఈ కవితలో ఉన్న విశేషం ఏంటంటే.. ఎలీయట్ ఈ కవితను భారతీయ తత్త్వచింతన పరంగా, సంస్కృత పదాలను వాడుతూ, ఆశావాదంతో ముగించారు. అలా భారతీయ ఆలోచనా రీతే ఈ ప్రపంచానికి సుఖశాంతులు ఇవ్వగలదని ఆయన ప్రత్యక్షంగా చెప్పినట్లయ్యింది. చివరి అధ్యాయంలో ఆయన సూచన ప్రాయంగా చెప్పిన బృహదారణ్యకోపనిషత్తులోని దకార త్రయం కథ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఈరోజు మనం ముందుగా వేస్ట్ ల్యాండ్ కవితా సారాంశాన్ని సంగ్రహంగా చెప్పుకుని ఆ తరువాత అందులో చెప్పబడ్డ ఉపనిషత్ కథను కూడా విపులంగా చెప్పుకుందాం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: