Margasira Masam,మార్గశిర మాసం విశిష్టత శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ
Автор: TELUGU OM TV
Загружено: 2025-11-21
Просмотров: 126
తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. మార్గశిర మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపలు తొలగిపోతాయి
తెలుగు మాసాల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. “మాసానాం మార్గశీర్షోహమ్” అని అంటారు. మార్గశిర మాసం లక్ష్మీనారాయణుడికి చాలా ఇష్టం. ఈ నెలలో చేయాల్సిన పూజలు, పుణ్య కార్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు
ఈ రోజున పోలి పాడ్యమి నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. పోలి పాడ్యమి కథను చదువుకుంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ నెల రోజులు దీపారాధన చేసి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. మరి, ఇక ఈ మాసంలో ఏ పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం.
ఈ నెల రోజులు దీపారాధన చేసి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. మరి, ఇక ఈ మాసంలో ఏ పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం.
మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని, ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తామో, అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి. ఈ ఐదు గురువారాలు వినియోగించుకొని లక్ష్మీదేవిని పూజించాలి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా పేర్కొన్నాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: