ఎటు నీ పయనం
Автор: Devadevam Bhaje (Bhakti Channel)
Загружено: 2023-03-01
Просмотров: 957
ఎటు నీ పయనం..
(చక్రవాకం)
(శ్రీ రామావదూత మరియు
త్రినాధుడు మండ్రాకురిటి)
సంచిత కర్మయై పొందిన యీ ప్రాపు
పుడమిపై పుష్పమై ప్రజ్వరిల్లెను నేడు
కర్మరాహిత్యమై నడువుము నేడైన
జన్మరాహిత్యమే కలుగునురా..
ఎటు నీ పయనం ఏది నీ గమ్యం
ఎరుగవా ఓ మానవా..
ఆశ నిరాశల జీవనం
అంతమౌనురా యిది ఒకనాడు
మరువకురా...
మరువకురా యిది మాయ బొమ్మయని
ఎరుకతో నీవు ఎరుగుము జీవా..
ఆలు బిడ్డలును, ఆత్మ బంధువులు
దరి చేరరురా కలిమి నశించిన
స్థిరములు కావురా...
స్థిరములు కావురా చలజీవితముల్
స్థిరమై యున్నది శ్రీరామనామం..
పుత్ర పౌత్రాది బంధు మిత్రులకు
భారమౌను నీ బాధల దేహము
జీవిత కాలము చేసిన చాకిరి జీవా..
జీవిత కాలము చేసిన చాకిరి
చిటెకెలో చితిపై చూర్ణమై పోవురా..
బ్రతికిన నాలుగు ఘడియల కాలము
భగవంతునిపై భారముంచుము
సర్వము తానుగ తలచి తలచి నువు
ఈశ్వరా..
సర్వము తానుగ తలచి తలచి నువు
సర్వేశ్వరునే శరణము వేడరా..
..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: