జాషువా గారి “శిశువు” పద్యాలు | Jashuva Poems | Sisuvu Padyaalu | Rajan PTSK | Ajagava |Gurram Jashua
Автор: Ajagava
Загружено: 2020-11-16
Просмотров: 23926
గుఱ్ఱం జాషువా గారి “పాపాయి” పద్యాలు
“వడగాల్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం” అన్నారు మన కవికోకిల జాషువా. నిజంగా ఆ నవయుగ కవి చక్రవర్తి కలం, ఏ అంశం మీద అయినా, వెన్నెల కలిసిన కవిత్వాన్నే కురిపిస్తుంది. పండితులనే కాదు పామరులనూ మురిపిస్తుంది. ఆయన వ్రాసిన ఖండకావ్యాలలోని ప్రతీ కవితా ఖండికా అద్భుతమైనదే. ఇలా వేరొకరు వ్రాయగలరా? అన్న ఆశ్చర్యాన్ని మనందరకూ కలుగజేసేదే. అటువంటి కవితా ఖండికలలో ఒకటి.. ఈరోజు మనం చెప్పుకోబోతున్న “శిశువు”.
ఈ శిశువు కవితా ఖండికలో.. అప్పుడే ఈలోకంలోకి వచ్చిన పసిపాప గురించి, జాషువా గారు వ్రాసిన అయిదు సీస పద్యాలున్నాయి. ఇవి చదివితే.. ఆ కవితా విశారదుని సున్నితమైన శిశు హృదయం, అనన్యసామాన్యమైన ఆయన భావ వ్యక్తీకరణా, ఎంత గోప్పవో తెలుస్తుంది. తిరుపతి వేంకట కవులలో ఒకరైన, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు, జాషువాగారి కాలికి గండపెండేరం తొడిగి.. “ఈ కవీశ్వరుని పాదం తాకి, నా జన్మ ధన్యం చేసుకున్నాను” అని ఎందుకన్నారో కూడా తెలుస్తుంది.
జాషువాగారి ఏ పద్యమైనా, సరళంగా, తేలికైన భాషలో, హాయిగా సాగిపోతుంది. కనుక, వాటికి ప్రత్యేకించి అర్థం చెప్పవలసిన పని లేదు. కానీ కొందరికైనా ఆ అవసరం ఉంటుందేమో! అన్న ఉద్దేశ్యంతో, ప్రతీ పద్యానికీ అర్థాన్ని కూడా చెప్పుకుంటూ వెళతాను. ఇక పదండి, జాషువా గారి “శిశువు”ను చూసొద్దాం.
Rajan PTSK
#RajanPTSK #Ajagava #Jashuva
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: