ఉజ్జయిని, ఓంకారేశ్వర్ దర్శనం
Автор: RRG J CHANNEL
Загружено: 2024-05-14
Просмотров: 2386
పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు విభాగంలో ఉజ్జైని, ఓంకారేశ్వర్ లను దర్శిద్దాం రండి...
హిందూ మత విశ్వాసాల ప్రకారం, జీవ నదులను దేవతలుగా పూజిస్తారు. భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడు వృషభరాశిలో ప్రవేశించిన సమయం నుంచి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సమయంలో నదిలో పుణ్య స్నానం ఆచరించి, పేదలకు దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
గురుడు వృషభరాశిలో సంచారం చేసే సమయంలో రేవా నదీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. రేవా నదినే నర్మదా నది అంటారు. ఓంకారేశ్వర్‌లో నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్‌లు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉండే నదీ ప్రవాహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా చాలా స్వచ్ఛతతో ఉంటుంది. ఘాట్ల వద్ద ఎక్కువ లోతు కూడా ఉండదు. భక్తులందరూ స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్ల కంటే ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే, అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
నర్మదా నది పుష్కరాలలో పుష్కర స్నానం చేయడానికి ఒంగోలు నుండి 19 మందిమి రైలు మార్గము ద్వారా మే 4వ తేదీ భోపాల్ వెళ్లి అక్కడ నుండి ఉజ్జయిని చేరుకొన్నాము. ఉజ్జయినిలో శ్రీ మహా కాళేశ్వర ఆలయం, శ్రీ కాలభైరవ ఆలయం, సాందీపనీ ముని ఆశ్రమం, మంగళనాధ మందిరం తదితర ప్రసిద్ధ ఆలయాలను, స్థలాలను దర్శించాము. మరునాడు ఓంకారేశ్వరం రోడ్డు మార్గమున వెళ్ళాము. నర్మదా నది ఒడ్డున పితృదేవతలకు సంతృప్తికరమైన పిండ ప్రధానము చేసి అనంతరం ఓంకారేశ్వరుని దర్శించుకోవడం తదుపరి మమలేశ్వరుని దర్శించుకొన్నాము. తదుపరి ఉజ్జయినికి తిరిగి రావడం జరిగినది మరునాడు ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మహారతి దర్శనం చేసుకోవడం జరిగినది మరి సాయంత్రానికి భోపాల్ ప్రయాణించి భోపాల్ నుండి రైలు మార్గము ద్వారా తిరిగి ఒంగోలు కి రావడం జరిగినది.
RRG J CHANNEL
మే 04 మొదలు 08 వరకు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: