రాముడికి ఓ భక్తుడి ఉత్తరం | A Letter to Lord Rama | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2025-04-05
Просмотров: 5065
నా రాముడికో లేఖ
రామా! ఈరోజు నీ పుట్టినరోజు కదా! అందుకే నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లేఖ పంపిస్తున్నా. కాస్తంత తీరిక చేసుకుని చదువు. ఈరోజు వైకుంఠం అయోధ్యలా ముస్తాబవుతుందనీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడవైన నీవు శంఖచక్రాలు ప్రక్కనపెట్టి కోదండం పట్టుకుంటావని, మా తల్లి లక్ష్మీదేవి సీతామహాసాధ్విగా అలరారుతుంటుందని నాకు తెలుసు. అందుకే నేరుగా వైకుంఠానికే కుండలినీ మార్గం ద్వారా నా ఉత్తరాన్ని పంపిస్తున్నాను. ఎంత బ్రహ్మేంద్రాది దేవతలు నీకు శుభాకాంక్షలు తెలపడానికి ఉదయం నుంచి వరుస కడుతున్నా, వసిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు తమ ప్రియశిష్యుడికి ఆశీర్వచనాలు ఇవ్వడానికి వచ్చి నీ సముఖంలో విలాసంగా కూర్చున్నా, మీ అక్కాబావగార్లైన పార్వతీపరమేశ్వరులు నీ మేనల్లుళ్ళైన గణపతీ కుమారస్వాములతో కలిసి విచ్చేసినా, నారదుడు, తుంబురుడు తమ వీణలైన మహతీ, కళావతులను వాయిస్తూ నీ దివ్యచరితాన్ని గానం చేస్తున్నా, యక్షగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరపన్నగాది దేవగణాలు “జయ శ్రీరామ, జయజయ రఘురామ, జయము జయము సీతారామ” అని జయజయధ్వానాలు చేస్తున్నా, ఇలా ఇందరి శుభాకాంక్షలు అందుకుంటూ, ఈ ప్రాణికోటికంతటికీ ఊపిరినిచ్చే నీవు ఊపిరి సలపనంత తీరికలేనితనంతో ఉన్నా, నీ భక్తకోటిలో ఒకడైన ఈ రాజన్ పి.టి.ఎస్.కె వంక కూడా ఒకసారి చూడాలిగా స్వామి. నా లేఖ చదవాలిగా స్వామీ! నువ్వు తప్పక చదువుతావనే నమ్మకం నాకుందనుకో! అయినా అన్నీ తెలిసినవాడివి, అంతా నీవైనవాడివి, అందరిలోనూ ఉన్నవాడివి.. నేనేం వ్రాస్తానో నీకు తెలియనిదా. నా అజ్ఞానం సంగతి నీవెరుగనిదా! అయినా ఏదో నా తృప్తికోసం వ్రాస్తున్నాను. సరే ఇక విషయంలోకి వస్తాను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: