karthika suddha ekadasi కార్తీక శుద్ధ ఏకాదశి శ్రీమతి వేదాంతం విష్ణు ప్రియ
Автор: TELUGU OM TV
Загружено: 2025-11-02
Просмотров: 161
కార్తీక మాసం మొత్తం పరమ శివుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. కానీ ఏకాదశి రోజు మాత్రం మహావిష్ణువును భక్తులు ఆరాధిస్తారు.
ఏడాదిలో పవిత్రమైన మాసాలు ఎన్ని ఉన్నా.. కార్తీక మాసం విశిష్టతే వేరు. పరమ శివునికి ఇష్టమైన మాసం ఈ కార్తీకం. ఈ మాసంలో ఏకాదశి, సోమవారం, పౌర్ణమిని పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలతో పాటు పౌర్ణమి రోజుల్లో పరమ శివుడిని పూజిస్తారు. కానీ ఏకాదశి రోజు మాత్రం మహా విష్ణువును భక్తులు ఆరాధిస్తారు. ఎందుకంటే.. ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ రోజ శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కుంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఆషామాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు మహా విష్ణువు యోగా నిద్రలోకి వెళ్తారు. నాటి నుంచి కొన్ని నెలల పాటు ఆయన యోగ నిద్రలో ఉంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ శుక్ల ఏకాదశి రోజున ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ రోజును సైతం పవిత్ర దినంగా పండితులు పేర్కొంటారు. ఈ రోజు ఉపవాసం చేయడం శుభప్రదమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ రోజున శ్రీమహా విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని అంటారు. ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తే.. వెయ్యి అశ్వమేధ యాగాలు.. వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుందని పండితులు పేర్కొంటారు.
శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయనను మేల్కొలిపేందుకు విష్ణులోకానికి.. బ్రహ్మాది దేవతలతోపాటు మునులు, మహర్షులు తరలి వెళతారు. వారంతా భజనలు, నాట్యం చేస్తూ మంగళవాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామి వారిని మేల్కొలుపుతారు. అనంతరం పరమేశ్వరుడు.. విష్ణుమూర్తిని ఆర్చించి హారతి ఇవ్వగా.. బ్రహ్మ వేదాటు పఠిస్తారని చెబుతారు.
ఇక ఈ ఉత్థాన ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఆ మరుసటి రోజు.. ద్వాదశి వేళ దేవాలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు.. దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసే వారి ఇంట ధన, ధాన్యాలు, ఐశ్వర్యంతోపాటు సుఖ సంతోషాలకు లోటు ఉండదని పండితులు స్పష్టం చేస్తారు.
మహాభారతం యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే అస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనించాడని చెబుతారు. ఉత్థాన ఏకాదశి.. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన వచ్చింది. ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని.. మహా విష్ణువును స్మరించుకోవాలి. అలాగే శ్రీహరి విగ్రహం లేదా ఫొటో ముందు శంఖం, గంటలు ఊపుతూ విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇక ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసం విరమించాలి.
గమనిక.. ఈ కథనాన్ని పురాణాలు ద్వారా.. పండితుల సలహాలతోపాటు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా రూపొందించబడింది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: