శ్రీశ్రీ చమక్కులు | SriSri chamakkulu | Sri Sri | Sri Sri Humour | Rajan PTSK | Ajagava
Автор: Ajagava
Загружено: 2020-08-27
Просмотров: 606952
మహాకవి శ్రీశ్రీ చమత్కార సంభాషణలు
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే [email protected] కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…”
“తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీ లెవ్వరు?”
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
మనదీ ఒక బ్రదుకేనా?
కుక్కలవలె, నక్కల వలె!
మనదీ ఒక బ్రదుకేనా!
సందులలో పందులవలె!
ఇలా విప్లవ కవితా జ్వాలలు కురిపించి, మన గుండెలు కణకణ మండించిన, మనతరం మహాకవి శ్రీశ్రీ.
శ్రీశ్రీ గారి పేరు చెప్పగానే మనకు ఇలా విప్లవకవిత్వమే గుర్తుకువస్తుంది. వారి సినిమా పాటల గురించి ప్రస్తావించినా.. వెంటనే ఏ.. “తెలుగు వీర లేవరా” పాటో.. “పాడవోయి భారతీయుడానో, లేదా ఉందిలే మంచికాలం ముందుముందునా వంటి అభ్యుదయ గీతాలో గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి శ్రీశ్రీ గారు చాలా హాస్య ప్రియులు. సునిశిత హృదయులు, సందర్భానుసారంగా చమత్కార బాణాలు వేయడంలో సిద్ధహస్తులు. ఆ మహాకవి చమక్కులలో కొన్నింటిని ఈనాటి మన అజగవ లో చెప్పుకుందాం.
రాజన్ పి.టి.ఎస్.కె
#RajanPTSK #SriSri #TeluguPoetry
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: