వైభవంగా ధనుర్మాస ప్రారంభం స్వామివారి సన్నిధిలో మ్రోగిన నెలగంట. సింహాచలం, డిసెంబర్ 16
Автор: AksharaVision News
Загружено: 2025-12-17
Просмотров: 89
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సింహాచలం
సింహాచల క్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ప్రారంభం
స్వామివారి సన్నిధిలో మ్రోగిన 'నెలగంట'
సింహాచలం, డిసెంబర్ 16
పురాణ ప్రసిద్ధమైన సింహాచల పుణ్యక్షేత్రం భక్తి శ్రద్ధలతో పరవశించింది. శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి సన్నిధిలో మంగళవారం ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా, ఆధ్యాత్మిక సౌరభంతో ప్రారంభమయ్యాయి. సింహగిరి అంతటా భక్తి వాతావరణం వెల్లివిరియగా, ఆలయ ప్రాంగణం మంత్రోచ్చారణలతో, ప్రతిధ్వనించింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. సుజాత ఆదేశాల మేరకు ఆలయ సహాయకానిర్వహణాధికారి కె,తిరుమలేశ్వరరావు,పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు , అర్చక స్వాములు, వేద పండితులు ,నాదస్వర వేదమంత్రాలతో మధ్యాహ్నం గం. 1:01 నిమిషాలకు శాస్త్రోక్తంగా ‘నెలగంట’ ఉత్సవం నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో మ్రోగిన నెలగంట శబ్దం ధనుర్మాస ఆగమనానికి ఆధ్యాత్మిక ప్రకటనగా నిలిచి, భక్తుల హృదయాలలో పరమానందాన్ని నింపింది.
వేద మంత్రాల ఘోష, నడుమ జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ధనుర్మాసం అంతటా స్వామివారికి నిర్వహించబోయే ప్రత్యేక సేవలు, నిత్య పూజలు, ఉత్సవాలకు ఇది శుభారంభంగా భావించబడుతోంది.
ఈ పవిత్ర కార్యక్రమంలో ల్యాండ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి గీతాంజలి, ఆలయ పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావు, పి.ఆర్.ఓ నాయుడు తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ధనుర్మాస శుభారంభాన్ని దర్శించుకుని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: