CM Revanth Reddy Calls for Education System Reforms Beyond Politics | Telangana Legislative Council
Автор: Telangana CMO
Загружено: 2025-03-26
Просмотров: 23395
Hon'ble Chief Minister Shri A. Revanth Reddy stressed the need for a complete overhaul of the education system, emphasizing that improving standards is a shared social responsibility. Speaking in the Legislative Council, he cited the 2021 National Achievement Survey, highlighting Telangana’s decline in subject proficiency and the drop in government school admissions.
✳️ “The education system is in crisis. Allocating funds alone won’t solve the problem—we need collective responsibility and reform,” he stated, urging stakeholders to contribute suggestions for a comprehensive education policy.
✳️ To strengthen the sector, the government has conducted DSC, filled 10,000 teacher posts, and completed long-pending transfers and promotions. However, he stressed the need to align student skills with industry demands.
✳️ For skill development, Young India Skills University (YISU) has been established, and outdated ITIs are being upgraded into Advanced Technology Centers (ATCs) across 100 constituencies. Additionally, the government is launching Young India Sports University and Academies to train athletes for the Olympics and plans to set up a Mining University in Kothagudem.
విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు.
✳️ విద్యా రంగంపై శాసనమండలిలో జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి గారు సమాధానమిచ్చారు. 2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందీ తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేని వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
✳️ “విద్యా విధానం కొంత ఆందోళనకరంగా మారింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో వాస్తవం ఉంది. విద్యా రంగంలో పడిపోతున్న ప్రమాణాలను పెంచాలంటే కేవలం నిధుల కేటాయింపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించినప్పుడే సమస్యను పరిష్కరించగలుగుతాం.
✳️ విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు, ప్రక్షాళన చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. అందరి సూచనలతో సమగ్రమైన ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించి చర్చిద్దాం. పడిపోతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మేల్కొనకపోతే భవిష్యత్తు తరాలకు మనం ద్రోహం చేసిన వారిమవుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన చేయలేం.
✳️ విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే, డీఎస్సీ నిర్వహించి 10 వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పూర్తి చేశాం.
✳️ అయితే, విద్యా ప్రమాణాలు పడిపోవడంలో కేవలం ప్రభుత్వానిదే కాకుండా సమాజంపైన కూడా బాధ్యత ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆలోచనలు చేసినన్ని రోజులు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయలేం.
✳️ యువతలో నైపుణ్యం కొరవడి వెనుకబడిపోతున్నారు. నైపుణ్యతలను పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (#YISU) ని ఏర్పాటు చేశాం. అలాగే, మూస పద్ధతిలో సాగుతున్న ఐటీఐలను సంస్కరిస్తూ కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి పలుకుతూ వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (#ATC) అప్‌గ్రేడ్ చేస్తున్నాం. వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం.
✳️ క్రీడాకారులను తయారు చేయడం, ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తాం. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం” అని వివరించారు.
#telangana #cmrevanthreddy #education #educationreforms #youngindiaskillsuniversity #yisu #advancedtechnologycenters #atc #dsc #teacherrecruitment #skillsdevelopment #sportsuniversity #mininguniversity #telanganaeducation #hyderabad #telanganarising #telanganabudget #telanganabudget2025 #revanthreddy #cmrevanth #telanganalegislativecouncil #telanganacouncil #telanganaassembly #palamururangareddyliftirrigation #prlip #jaipalreddy #sjaipalreddy #telanganamovement
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: