#BCCNEWSనారావారిపల్లెలోముఖ్యమంత్రిచంద్రబాబునాయుడుగతంలోగ్రామాలకువెళ్లడానికిప్రజలుభయపడ్డారు
Автор: BCC NEWS
Загружено: 2026-01-15
Просмотров: 21
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం
• గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు.
• ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్లి పండగ చేసుకున్నారు.
• జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు.
• ప్రభుత్వ పాలసీలతో చదవుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారుఉన్నారు. అయినా చాలామందిలో జీవన ప్రమాణాలు లేవు.
• పీ4 లోభాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం.
• టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపద సృష్టి కంటిన్యూగా పెరుగుతోంది.
•ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే దేశాల్లో భారత్ ఉంది.
• బిలీయనర్స్ పెరుగుతున్నారు... ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి.
•అసమానతలు తగ్గకుంటే ఆ సంతృప్తి ఉండదు.
• అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది. అందుకే పీ4 తీసుకొచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం.
• 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతాం. ఒక్క డబ్బే కాదు...మేనేజ్మెంట్ స్కిల్ కావాలి.
• 3 రోజులుగా స్వగ్రామంలోనే ఉండి సమస్యలు కూడా తెలుసుకున్నాను.
• భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నాం.
• సంక్రాంతి రైతుల పండుగ. ఫ్రెష్ గా పంటలు ఇంటికి వస్తాయి. పంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు.
• రూ.10 వేల కోట్లు ధాన్యం రైతులకు చెల్లించి రైతుల ఆనందంగా ఉండేలా చూశాం
• సంక్రాంతి రోజున పెద్దలను తలచుకుని నివాళులు అర్పిస్తాం. మన పెద్దలను మనం గుర్తు పెట్టుకోకపోతే వారసత్వం లేదు.. మనుషులకు జంతువులకు తేడా ఉండదు.
• కనుమ పండగ సందర్భంగా ప్రకృతిని ఆరాధించుకుని పశువులను పూజించుకుంటాం. కోడి పందేలను కూడా నిర్వహించుకుని సాంప్రదాయంగా గడిపేవాళ్లం.
• 2047 స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ 2047..దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029కి, 2039కి ఏం చేయాలో టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నాం.
• జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశ్యంతోనే పని చేస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించాలి. ప్రతి ఒక్కరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలి.
• స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని స్టార్ట్ చేశాం. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నాం.
• స్పెషల్ ఆఫీసర్‌ను పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం.
• ఇంటి స్థలాలున్నా సొంతిళ్లు లేదు. అందుకే ఏడాదిలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పిస్తాం. ఇంటింటికీ నీటి సరఫరాను కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: