వేంకటేశా శ్రీనివాసా కావ రావా తిరుమలేశా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Автор: vvreddy
Загружено: 2025-10-31
Просмотров: 1781
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
బలే మంచి రోజు పాట స్టైల్
నమో వేంకటేశా - నమో శ్రీనివాసా.
దేవా కావరావా తిరుమలేశా
కలియుగాన శిల రూపమున ఇలవేల్పుగ వెలసితివయ్యా
కోరి నిన్ను కొలిచిన వారి కోరికలు తీర్చెదవయ్యా
కాన రావ కోమల రూపా కాపాడగను రావేమయ్యా
తులసీదళ మాలలు తెచ్చి నీ మెడలో వేసెదమయ్యా
తెల్లకలువ విరజాజులును బంతి చామంతి పూలతో
తోమాల సేవలు చేసి తరియించెదమో కోనేటిరాయ
గోవింద గోవిందా హరి గోపాలా ముకుందయనుచు
గిరులన్నీ మారు మ్రోగగా నీ నామ స్మరణ చేయగా
గరుడ గమన నీ గుడి వాకిట నిలిచిన భక్తుల మొర వినరావా
నీ పాటలు పాడెదమయ్యా నీ భజనలు చేసెదమయ్యా
నీ చరణ దాసులమయ్యా మమ్మేలగ రావేమయ్యా
నీ కృతులను వ్రాసి పాడిన అప్పన్న దాసుని కావగదయ్యా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: