కోటలోని శ్రీ కోటమ్మతల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగం.. అధిక సంఖ్యలో హాజరైన అయ్యప్పస్వామి భక్తులు..
Автор: శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయం_కోట
Загружено: 2025-10-25
Просмотров: 500
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తిరుపతి జిల్లా, కోట పట్టణంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి అమ్మవారి ఆలయానికి అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి - లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు.. అయ్యప్పస్వామి భక్తుల ఆటపాటలతో ఆలయ ప్రాంగణంలో మార్మోగిపోయింది. దాతల దాతృత్వంతో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం, వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నెట్టంబాక మునిరెడ్డి - మంజులమ్మ దంపతులతో పాటు చిరంజీవి మురళి, విహార్, జ్యోతి ఉభయదాతలుగా వ్యవహరించారు.. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. ప్రతీ ఒక్కరు దాతలగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఇప్పలపల్లి కిష్టయ్య, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావ్, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: