Potuluri Veera Brahmam gaari KALAGNANAM in 2023 | Brahmam gaari unkown Kaalagnanam Facts Telugu .
Автор: Telugu Planet Official
Загружено: 2023-02-02
Просмотров: 4907
యోగి వేమన , వీర బ్రహ్మంగారు
ఇద్దరి రచనలలోనూ, భావాలలోనూ రచన విధానంలోనూ అనేక సాదృశ్యాలు కనిపిస్తున్నాయి
ఇంచుమించు బ్రహ్మంగారి అన్ని రచనలలోనూ వేమన గురించిన అనేక ప్రస్తావనలు ఉన్నాయి.
వీర బ్రహ్మంగారు వేమనను కలిసారా అనేది అధికమైన ఆసక్తి రేకెత్తించే విషయము.గా
బ్రహ్మంగారు ఉటంకించి చెప్పిన కారణం వల్ల మనకు కలుగుతుంది
అంతేకాదు వీర బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడానికి ఉద్యమించడానికి
ప్రేరణ కలిగించిన వారు యోగి వేమన అయ్యి ఉండవచ్చు అని కూడా అనిపిస్తుంది.
యోగి వేమన బ్రహ్మంగారులు ఇద్దరు సమకాలీకులైనప్పటికీ
వేమన కంటే బ్రహ్మంగారు చిన్నవారు
ఎందుకంటే బ్రహ్మంగారు శతకాలు చెప్పే నాటికి వేమన ప్రసిద్ధుడై ఉన్నాడని బ్రహ్మంగారు ప్రస్తావించిన దానిని బట్టి మనకు తెలుస్తుంది
బ్రహ్మంగారి శతకాలలో వేమన గురించి తెలుసుకోవడానికి అపురూపమైన ఎనిమిది పద్యాలు లభిస్తున్నాయి ఇవిగాక వచన కాలజ్ఞానంలో మొట్టమొదటనే వేమన పేరు ప్రస్తావించబడింది
అలాగే కాలజ్ఞాన తత్వాలలో అనేక చోట్ల వేమన పేరు ఉటంకించబడి ఉన్నది
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు
వేమన గొప్పదనాన్ని గుర్తించి కీర్తిస్తున్నట్టుగానే ఇవన్నీ కనిపిస్తున్నాయి
వేమన వ్యక్తిగత జీవిత విధానాన్ని ప్రత్యక్షంగా చూసి చెబుతున్నట్టు కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి
ప్రకృతి అంతా తీసి పట్టే ముల్లెగ గట్టి
పెట్టె లోపల వేయు పెద్దలనుంచు
ఉత్తమమైన పెద్దల చిత్తంబు గానలెరో
వేమన అంత పెద్ద వెతుకు కాళికాంబ హంస కాలికాంబ
మనసుకు గురువునకు మహావైరవర్గంబు
యౌనో కాదో పెద్దలు అడిగి కనుడి
నేర్పు పెద్దలైతే నెరుగుదురీ తీరు
వేమన అంత పెద్ద వెతుకు
కాళికాంబ హంస కాలికాంబ
ఇక్కడ మనసు అంటే కోరికలు పెనవేసుకొని ఉన్న మనసు
గురుడు అంటే ఆత్మ
కోరికలు ఉద్భవించే మనసుకు
ఆత్మకు
ఎప్పుడూ మహా వైరమే
అటువంటి మనసును జయించి
ఆత్మ అనే బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న వారు నేర్పు పెద్దలు అలా తెలుసుకున్నవాడు వేమన కాబట్టి నేర్పు పెద్దలైన
వేమన మనసును జయించే విధానాన్ని అడిగి తెలుసుకోమంటారు వీర బ్రహ్మంగారు
ఇలా వేమన వ్యక్తిగత జీవితాన్ని పట్టి చెబుతున్న అరుదైన సాక్షాలు బ్రహ్మంగారి రచనలు దొరుకుతున్నాయి
ఇవి వేమన జీవితాన్ని పటిష్టమైన కోణంలో అంచనా వేయడానికి అపూర్వమైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి ఇంతవరకు ఎక్కడా లభించని వేమన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు బ్రహ్మంగారి రచనలలోని దొరకడం చాలా విశేషం
వేమన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోగోనే చరిత్రకారులకు పరిశోధకులకు ఇవి ఉపయోగకరమైన సాధనాలు
ఈ పద్యముల ద్వారా ఆటువంటి ఉత్తముడైన వేమనను
పెద్దగా భావిస్తున్నారు వీర బ్రహ్మంగారు
అలా భావించి వేమనంత పెద్దను వెతకమంటున్నారు
అంటే బ్రహ్మంగారి కాలం నాటికి
బ్రహ్మంగారి వంటి సంఘసంస్కర్త కవి యోగి వేమనను పెద్దగా గుర్తించిన ఉన్నతికి ఎదిగి ఉత్తముడిగా వేమన కీర్తింపబడుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతున్నది
మరో పద్యంలో
బ్రతుకుల అస్థిరతికి సద్గురు సేవ
బ్రతుకనేర్చినవా బ్రతికిపోయిరి
సితక బతికిన వారు వీరవేమన గదా
కాళికాంబ వీర కాళికాంబ
సితికి బ్రతికినవారు వేమన అనే వాక్యం వేమన ఒకప్పుడు బాగా ఉచ్చ స్థితిలో ఉండేవాడిని లేదా బాగా ఉన్నతమైన వంశానికి చెందిన వాడిని తెలియపరుస్తుంది దీనిని బట్టి వేమన రాజవంశానికి చెందిన వాడనేది నిజమే అనిపిస్తుంది.
ముఖ్యంగా వేమన జీవితంలో బాగా పరిచయం ఉన్నవారు లేదా వేమన జీవితాన్ని దగ్గరగా చూసిన వారు మాత్రమే ఇటువంటి విషయాలు చెప్పగలరని కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి.
దీనిని బట్టి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారికి వేమన జీవితంతో బాగా సన్నిహితమైన పరిచయం ఉంది అంతేకాదు వేమన దేశాటన చేసిన వ్యక్తి అని కూడా బ్రహ్మంగారికి బాగా తెలుసు
దానికి నిదర్శనంగా
వద్ద ఉండు వాని సిద్ధమని తెలియక
బుద్ధిలేక నువ్వు పోయి భూమి తిరిగే
భూమి తిరిగే ఫలము వేమనకే తెలియురా
కాళికాంబ వీర కాళికాంబ
భూమి తిరిగే ఫలము వేమనకు తెలియురా అనే వాక్యం మొదట రెండు పంక్తులలో పూర్తిగా విభేదిస్తున్నది
ఇక్కడ వేమన భూమి తిరగడాన్ని ప్రశంసిస్తూనే
రెండవ పాదంలో బుద్ధి లేఖను పోయి భూమి తిరిగి అని ఆ తిరగడాన్ని విమర్శిస్తున్నది
ఈ పద్యానికి సరైన అన్వేయం కోసం చూడాలంటే మరో పద్యాన్ని కూడా తీసుకోవాలి . అది
దేశాలు తిరిగేది దేవాలయం బనేది
కాశీకి పొయ్యేది కానలేక
కాశీనాథుండొక్క దేశాన యుండు నా
కాళికాంబా విరా కాళికాంబ
దేవాలయం కోసం దేవుని కోసం దేశాలు తిరగడం అనేది జ్ఞానంలేకె
అలా కాక భూమి తిరగడం జ్ఞానాన్వేషణ కోసం అని గ్రహించి దాని ఫలితాన్ని
గ్రహించిన వారు వేమన
అని బ్రహ్మంగారు చెప్పిన ఈ రెండు పద్యాలకు అన్వయం చెప్పుకోవాల్సి ఉంటుంది
దీని ప్రకారం ఒకప్పుడు బాగా బ్రతుకుతూ చివరికి ఐశ్వర్యం
పోగానో లేదా ఐశ్వర్యాన్ని కావాలని త్యాజించొ
వేమన దేశసంచారిగా జీవితాన్ని సాగించాడనే విషయాన్ని బ్రహ్మంగారు స్పష్టం చేస్తున్నారు
అంతేకాదు సంసారాన్ని కూడా త్యజించి
యోని మరిచి బ్రహ్మజ్ఞానం కోసం అన్వేషించిన కర్మ యోగి వేమన అని కూడా బ్రహ్మంగారి రచనల వల్ల తెలుస్తుంది
యోని మరచినవారు ఎవరూ లేరయా
యోని మీదనే కద్దు ఎవ్వరికీ మోహంబు
యోని మరిచిన వారు వరవేమన గదో
కాళికా అంబా వీర కాళికాంబ
దీని తర్వాత మరో పద్యంలో వేమన బ్రహ్మజ్ఞాని అని బ్రహ్మంగారు స్పష్టంగా తెలియజేశారు
సమకారం నాటికి వేమన బ్రహ్మజ్ఞానిగా మరో బ్రహ్మ జ్ఞాని అయిన బ్రహ్మంగారి చేత గుర్తించబడి ప్రశంసించబడడం చరిత్రలో ఒక అరుదైన అపురూపమైన సంఘటనగా అభివర్ణించవచ్చు
దీనివల్ల ఇద్దరు బ్రహ్మజ్ఞానుల వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయి
వేమన బ్రహ్మజ్ఞాని అనే విషయం స్పష్టం చేయగలిగారంటే అతనిని బ్రహ్మజ్ఞానిగా గుర్తించే తంతటి వ్యక్తిత్వం కలిగిన జ్ఞాని బ్రహ్మంగారు అని స్పష్టపడుతున్నది. వేమన బ్రహ్మజ్ఞాని అని ప్రత్యక్షంగా తెలియజేస్తూ లభిస్తున్న మొట్టమొదటి ఆదారం కూడా ఇదేనేమో
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: