TELUGU STORIES - బిచ్చగాడి తో పెళ్లి | Moral Stories in Telugu | Telugu Kathalu | Mahesh Studios
Автор: Mahesh Studios
Загружено: 2025-12-29
Просмотров: 894
TELUGU STORIES - బిచ్చగాడి తో పెళ్లి | Moral Stories Telugu | Telugu Kathalu | Mahesh Studios Telugu
#బిచ్చగాడితో_పెళ్లి
#బిచ్చగాడి అదృష్టం
#telugu #telugukathalu #telugustories #telugumoralstories #neethikathalu #teluguneethikathalu #bommalakathalu #bommalu #storiesintelugu
#maheshstudios #beggers #story
Who work For This Channel
Writer : Dhruvansh
Voice over artist : Mounisha ,Anusha, Anu , Ramesh ,
Studios : Sai Star Studios
Story Board : Gangadhar Nakkala
Animation HOD : L Chiatanya.Pawan
Animators : Nikil Bro , Deepak,Pawan
Editor : SaiNath
Producer : Mahesh Mama
Technical Support : Vamshi VS
more 20+ People working For this channel
Thank you
Concept of The Video :
రంగనాథం గారు తన భవంతి ముందున్న పెద్ద అరుగు మీద హుందాగా కూర్చుని చుట్ట కాలుస్తున్నారు. ఎదురుగా పురోహితుడు శాస్త్రి గారు పంచాంగం చూస్తున్నారు. పక్కనే బంటు రామయ్య విసనకర్రతో విసురుతున్నాడు.
రంగనాథం: "ఏమయ్యా శాస్త్రి! పొద్దున్నే పంచాంగం పట్టుకుని ముభావంగా కూర్చున్నావ్? నా జాతకంలో ఏమైనా దోషం ఉందా? లేక నా సంపదకి ఏమైనా దిష్టి తగిలిందా?"
శాస్త్రి: (నసిగుతూ) "అబ్బే అదేం లేదు బాబుగారు. మీ జాతకం రారాజు జాతకం. కానీ... అమ్మాయి లక్ష్మి జాతకమే కాస్త..."
రంగనాథం: (కోపంగా) "కాస్త ఏమిటి? నాలిక మడత వేయకు శాస్త్రి. సూటిగా చెప్పు."
శాస్త్రి: "అదేనండి... అమ్మాయి జాతక చక్రంలో సప్తమ స్థానంలో శని చూపు బలంగా ఉంది. ఈ ఏడాది గడిచేలోపు పెళ్లి జరగాలి. కానీ, వరుడు మాత్రం..."
రంగనాథం: "వరుడు ఎవరు? ఏ సంస్థానాధీశుడో, జమీందారో అయ్యుంటాడు. అంతేగా?"
శాస్త్రి: (ధైర్యం తెచ్చుకుని) "లేదు బాబుగారు. గ్రహాల స్థితి చూస్తుంటే... అమ్మాయికి రాజయోగం ఉన్నా, భర్త స్థానంలో దారిద్ర్యం కనిపిస్తోంది. అమ్మాయి ఒక బిచ్చగాడిని పెళ్లి చేసుకునే యోగం ఉంది అని రాసి ఉంది."
రంగనాథం: (గట్టిగా నవ్వి, చుట్టని నేలకేసి కొట్టి) "హహహ! శాస్త్రి! నీ పంచాంగం పాతబడిపోయినట్టుంది. లేదా నీ బుర్ర చెడిపోయి ఉంటుంది. ఈ ఊరి జమీందారు రంగనాథం కూతురు బిచ్చగాడిని పెళ్లి చేసుకోవడమా? ఆ బ్రహ్మ దేవుడు కిందకి దిగి వచ్చినా అది జరగదు."
శాస్త్రి: "అయ్యో బాబుగారు, విధి లిఖితం ఎవరూ మార్చలేరు కదా."
రంగనాథం: "విధిని మార్చే శక్తి నా ధనానికి ఉంది శాస్త్రి. చూస్తూ ఉండు, వచ్చే పౌర్ణమి నాటికి ఆ పక్క సీమ జమీందారు కొడుకుతో నా కూతురి పెళ్లి జరిపించి, నీ పంచాంగాన్ని అగ్గిలో వేస్తాను."
ఇంతలో గేటు బయట నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది.
శివయ్య (బిచ్చగాడు): "భవతి భిక్షాం దేహి! కర్మని తప్పించడానికి కర్తని అని విర్రవీగే ఓ మనిషీ... ఇంత అన్నం పెట్టు."
రామయ్య: (విసురుతూనే) "ఏయ్! ఎవరది? దొరగారు కోపంలో ఉన్నారు. ఇప్పుడు భిక్షలు లేవు, గిక్షలు లేవు. వెళ్ళు."
శివయ్య: "ఆకలికి కోపంతో పనిలేదురా అబ్బాయి. ఆకలి కడుపుకి, అహంకారం తలకి - రెండూ ప్రమాదమే."
రంగనాథం: (లేచి నిలబడి) "ఎవడ్రా వాడు? నా ఇంటి ముందు నిలబడి నాకే నీతులు చెప్తున్నాడు? రేయ్ రామయ్య, వాడిని లోపలికి పిలు."
రామయ్య వెళ్లి, చింపిరి గుడ్డలతో, మెడలో రుద్రాక్షలతో ఉన్న శివయ్యను తీసుకువస్తాడు.
రంగనాథం: "ఏరా బైరాగి? ఏంటి నీ పొగరు? ఊరందరూ నాకు వంగి దండాలు పెడుతుంటే, నువ్వు మాత్రం నిల్చుని నీతులు చెప్తావా?"
శివయ్య: "దండం మనిషికి కాదు దొరా, మనిషిలోని దైవానికి పెట్టాలి. నీలో అహంకారం అనే రాక్షసుడు ఉన్నంత సేపు, ఆ దైవం కనిపించడు."
రంగనాథం: "నోరు ముయ్యి! అసలే ఆ శాస్త్రి ఏదో వాగుతుంటే నువ్వు మధ్యలో వచ్చావు. నా కూతురు జాతకం బాగోలేదని, బిచ్చగాడిని చేసుకుంటుందని అంటున్నాడు. అది విని నవ్వొస్తోంది నాకు."
శివయ్య: "శాస్త్రి గారు చెప్పింది నిజమే దొరా. నువ్వు ఎంత ఎత్తు గోడలు కట్టినా, ఎంత బంగారం పోసినా... రాసి పెట్టి ఉంటే, ఆ తల్లి మెడలో తాళి కట్టేది ఓ పేదవాడే. అది ఈ బిచ్చగాడు కూడా కావచ్చు."
రంగనాథం: (పట్టరాని కోపంతో) "ఏమన్నావ్? నువ్వా? నా కూతురిని నువ్వు చేసుకుంటావా? రామయ్య! వీడిని మెడ పట్టి బయటకి గెంతు. లేదు, ఆగు... వీడికి ఒక సవాల్."
శివయ్య: "సవాలా?"
రంగనాథం: "అవును. సరిగ్గా వారం రోజులు. ఈ వారం రోజుల్లో నా కూతురి పెళ్లి దేశంలోనే అత్యంత ధనవంతుడితో చేసి చూపిస్తా. అప్పుడు నువ్వు ఈ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఒకవేళ నేను చేయలేకపోతే... నా ఆస్తి మొత్తం రాసిచ్చి, నా కూతురిని నీ చేతిలో పెడతా. ఒప్పుకుంటావా?"
శివయ్య: (చిరునవ్వుతో) "నీ ఆస్తి నాకు అక్కర్లేదు దొరా. కానీ విధిని సవాల్ చేస్తున్నావు కాబట్టి, చూద్దాం. వారం రోజులేగా... ఈ అరుగు మీదే పడిగాపులు కాస్తాను."
రంగనాథం: "రామయ్య! వీడిని ఇక్కడే పడి ఉండనివ్వు. నా వైభవం చూసి ఏడిచి చావాలి వీడు."
రంగనాథం భార్య పార్వతమ్మ, కూతురు లక్ష్మి గదిలో ఉన్నారు. లక్ష్మి తల వంచుకుని కూర్చుని ఉంది.
పార్వతమ్మ: "ఏమండీ! అసలేం చేస్తున్నారు మీరు? ఆ వీధి బిచ్చగాడితో పందెం కాయడం ఏంటి? మన పరువు ఏం కావాలి?"....Continue on video 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: