జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
Автор: EYE FOCUS MEDIA
Загружено: 2025-12-11
Просмотров: 12
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మాట్లాడుతూ......
విశాఖపట్నంలో గతంలో నగర పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని దృష్టి పెట్టాము
ఎచ్చెర్ల నుండి ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను
జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నాము
క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, పొలిటికల్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకుంటే వచ్చే లాభమేంటి అని ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న
పార్టీలో క్రియాశీల సభ్యులుగా చేరితే ఒంటరిగా పోరాటం చేయలేని వారికి, పార్టీతో జతకట్టి పోరాటము చేయడానికి ఉపయోగపడుతుంది, సమస్యలు పరిష్కరించుకోవచ్చు
పార్టీలో క్రియాశీల సభ్యత్వం చాలా ముఖ్యమైనది, ప్రతి కార్యకర్తకు భద్రత కల్పిస్తుంది
త్రిశూల్ అనే కార్యక్రమం కార్యకర్తలు కోసం ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ప్రకటించారు
పవన్ కళ్యాణ్ గారి అన్నగా కాకుండా ,పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేయడానికి ఇష్టపడతాను
గతంలో వైసీపీ లాంటి దుర్మార్గ పార్టీపై విజయవంతంగా జనసేన పార్టీ తరపున పోరాడాము
తెలుగుదేశం, బిజెపి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ పార్టీపై పోరాడి విజయము సాధించి,ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాము
జనసేన పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు గడిచినా ఎటువంటి పదవులు పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు
నేడు జనసేన పార్టీ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు లేవు అనే విధంగా మన పార్టీ పైకి ఎదిగింది
క్రియాశీల సభ్యత్వం జనసైనికులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్లాట్పామ్ వంటిది
పవన్ కళ్యాణ్ గారు పార్టీ, ప్రజల కోసం పాటుపడుతూ వ్యక్తిగత జీవితం చాలా కోల్పోతున్నారు
రానున్న రోజుల్లో గ్రామస్థాయి, కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి
కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వలన అవకాశాలు హెచ్చుతగ్గుగా ఉండవచ్చు
ప్రతి కార్యకర్త రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది
పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కార్యకర్తలకు ఇంకా పదవులు రాదలేదని కొంతమంది అసహనంతో ఉన్నారు
పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం, క్రియాశీల సభ్యత్వంలో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: