టీమిండియా విజయంలో శ్రీచరణి భాగస్వామ్యంతో యావత్తు దేశం కడప వైపు
Автор: MTelugunews
Загружено: 2025-11-03
Просмотров: 80
యా వత్తు దేశం కడప వైపు చూస్తుంది
కడప ఎమ్మెల్యే మాధవి
మహిళల క్రికెట్‌లో టీమిండియా విజయంలో శ్రీచరణి రెడ్డి భాగస్వామ్యంతో యావత్తు దేశం కడప వైపు చూస్తోందని కడప ఎమ్మెల్యే మాదవీరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలుత మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. పైనల్ మన జట్టు సౌత్ ఆఫ్రికా టీం ను చిత్తుగా ఓడించి తమ సత్తాచాటారన్నారు. మన ముంబై గడ్డపై ప్రపంచ మహిళా క్రికెట్లో తొలి విజయమన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజయం సాధించిన వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చే చర్యలుచేపట్టనున్నారన్నారు. కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీ చరణీ రెడ్డి తన స్ట్రిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టింటిన తీరు ప్రశంసనీయమన్నారు. మహిళా ప్రపంచ కప్ భారత మహిళా క్రికెట్ టీమ్ గెలవబోతోందని ముందుగా అందరూ వీక్షించేలా ఎల్‌సీడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశామన్నారు. లోకేష్ స్వయంగా కుటుంబ సభ్యులతో ముంబయికి వెళ్లి మ్యాచ్ వీక్షించి అభినందించారన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారు చరిత్ర సృష్టిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వసిస్తారన్నారు. ఈ విషయంగా శ్రీచరణిరెడ్డికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల తోడ్పాటు అందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కడపలో క్రీడాభివృద్ధికి మరింత కృషిచేస్తూ అన్ని రకాల క్రీడా కారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అ«ధ్యక్షులు మన్సూర్ అలీఖాన్, మైనార్టీ నేత జిలానీబాష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మన్సూర్ అలీ ఖాన్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జల తిరుమలేష్, పాలకొండ్రాయుడు దేవస్థానం చైర్మన్ రెడ్డయ్య, టిడిపి నాయకులు జిలాని పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: