నల్లమలలో రమణీయప్రదేశం
Автор: Sahasa Yatrikudu
Загружено: 2023-02-10
Просмотров: 16936
శ్రీశైలం భూకైలాసం, భూకైలాసం కన్నా శ్రీశైలమే మిన్న అని మహాదేవుడు కొనియాడిన క్షేత్రం శ్రీశైలం. శ్రీశైల మహాక్షేత్రంలో నెలవై ఉన్న అద్భుత రమణీయ ప్రశాంత ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాల్లో కదళీవనం ప్రశస్తమైనది.
శ్రీశైల మహాపురాణం ప్రకారం సాధకుడు #చుక్కలపర్వతం పైకెక్కి మూడు లక్షల పంచాక్షరిని జపిస్తేనే ఈ కదళీవనాన్ని దర్శించగలుగుతాడు. ఈ కదళీవనంలో #దత్తాత్రేయుని అవతార పరంపరలో మూడవ వారైనా #నరసింహసరస్వతీ స్వామి వారు అదృశ్యమైనారు. పరమ #శివభక్తురాలు #అక్కమహాదేవి సిద్ధి పొందిన స్థలం కూడా ఇదే. నరసింహ సరస్వతీ స్వామి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అక్కల్కోట మహారాజుగా పేరుగాంచారు. ఈయన ఇక్కడ తన తపశక్తినంతటని ధారపోసారని స్థానికుల విశ్వాసం.
శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని వర్ణించిన కావ్యాలలో కొన్నిటిలో సందర్భానుసారం కదిలివన ప్రాముఖ్యతను పవిత్రతను వర్ణించటం జరిగింది కన్నడ భాషలో 12వ శతాబ్దంలో #శివచరణములుగా పిలువబడే శివ కవుల సమూహం చేయు వ్రాయబడిన వచన సాహిత్యంలో కూడా కదలివన ప్రస్తావన ఉంది. #శ్రీనాథుడు చే రచించిన #కాశీఖండంలో అగస్యుడు కాశీ క్షేత్రం నుండి వస్తు మార్గమధ్యంలో #కదలివనం, #బదరీవనం, #గౌరీవనం, #బిల్వవనాది ముఖ్య వనంబుల చేత శ్రీశైల క్షేత్రం ప్రసిద్ధి చెందినదని చెప్పారు.
#నాగులూటి శేషనాథుడు రాసిన #శ్రీపర్వతపురాణం లో శ్రీశైల పరిసరాలలో వేరువేరుగా తొమ్మిది కదలివనాలు ఉన్నాయని సిద్ధ సాధకులకు మాత్రమే అవి గోచరం అవుతాయని సాధారణ మానవులు ఎవరూ చూడలేరని చెప్పడం జరిగింది. దత్త భక్తులందరూ అత్యంత భక్తిగా పఠించే #గురుచరిత్రలో కూడా కదలివన ప్రస్తావన ఉంది. భవభూతి సంస్కృతంలో రాసిన మాలతీమాధవం లోనూ #హర్షుని #రత్నావళి నాటకంలోనూ శ్రీశైల పరిసరాలలోని కదిలివనంలో సిద్ధ పురుషులు ఉండేవారని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయి.
https://www.facebook.com/vedadri.nall...
https://www.instagram.com/invites/con...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: