Latest
Автор: SMJ CREATIONS
Загружено: 2025-12-21
Просмотров: 9950
SMJ CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church, the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching the first time or not yet subscribed,
please do subscribe to SMJ CREATIONS to receive the latest videos which would help you grow in Faith
Lyrics : Fr Yohanu Katru
నిరీక్షణయాత్రను కొనసాగించగా
మాతృకయే తిరు కుటుంబము
ప్రభుచిత్తమును పాటించగా
ప్రేరణయే పవిత్ర కుటుంబము
యేసు మరియ యోసేపుల కుటుంబము
ధరణిలో మనలను దీవించే తిరుకుటుంబము
చరణం1:
స్త్రీలందరిలో ధన్యురాలైన మరియ తల్లిగా
నీతిమంతుడైన యోసేపు గారు తండ్రిగా
రక్షకుడైన యేసుక్రీస్తు వారి బిడ్డగా
జీవించిన నజరేతు కుటుంబము
ఈ భువిలో మనకు ఆదర్శము
యేసు మరియ యోసేపుల కుటుంబము
ధరణిలో మనలను దీవించే తిరుకుటుంబము
చరణం2:
తిరు కుటుంబమును
అనుదినము స్మరించగా
మన జీవితాలలో వారిని కీర్తించగా
విశ్వాసంలో వారిని వెంబడించెదము
మోక్షములో మనము చేరేదము
యేసు మరియ యోసేపుల కుటుంబము
ధరణిలో మనలను దీవించే తిరుకుటుంబము
Song-2
విశ్వాసిగుండెలో జీవించే నాధుడవు నీవే..అ..అ
మట్టి మనిషిని అమరుడుగా చేసే దేవుడవు నీవే.అ..అ
నీ జన్మదినమే మా కనుల పండుగ
రాజుల రాజా స్తోత్రము ప్రభువుల ప్రభువా స్తోత్రము
దివిపువి నేలే రాజా స్తుతి స్తోత్రము
జగమంతా సంబరాలే-
క్రిస్మస్ పండుగ సంబరాలే-
రాజుల రాజా స్తోత్రము ప్రభువుల ప్రభువా స్తోత్రము
దివిభువి నేలే రాజా స్తుతి స్తోత్రము
జగమంతా సంబరాలే-
క్రిస్మస్ పండుగ సంబరాలే-
చరణం1:
ఇమ్మానుయేలు దేవుడవు ..
ప్రేమ స్వరూపుడవు /2
మట్టి మనిషి అమరుడవ్వగా.. మా మధ్య జీవించు దేవుడవు/2
రాజుల రాజా స్తోత్రము ప్రభువుల ప్రభువా స్తోత్రము
దివిభువి నేలే రాజా స్తుతి స్తోత్రము
జగమంతా సంబరాలే-
క్రిస్మస్ పండుగ సంబరాలే-
చరణం2:
కరుణామయుడవు ..
తేజోమయుడవు/2
పరమున మమ్ము చేర్చగా
భువికి వచ్చిన దేవుడవు /2
రాజుల రాజా స్తోత్రము ప్రభువుల ప్రభువా స్తోత్రము
దివిభువి నేలే రాజా స్తుతి స్తోత్రము
జగమంతా సంబరాలే-
క్రిస్మస్ పండుగ సంబరాలే-
3song
రండి రారండి ఓ జనులారా
ప్రభువును ఆరాధించండి..
రండి రారండి క్రిస్మస్
పండుగను చేయగ రారండి….।
ప్రేమ పుట్టెను ఈ భువిలో
పరిపూర్ణ ప్రేమ ఇది
దేవుడే పుట్టెను ఈ ఇలలో
పరిపూర్ణ మానవుడు
జీవజలములే ప్రవహించెను
కృప వెంబడి కృప ఉద్భవించెను
రండి రారండి ఆనందంతో
రక్షకుని ఆరాధించండి
మహిలో వెలసినమహోన్నతుని
పూజించగ రండి
చరణం 1:
దివిభూవినేలే రారాజు
హృదయములో ఉండగా వచ్చాడు
తన కృప హస్తములతో
మనలను నిత్యం
రక్షించవచ్చాడు
రండి రారండి ఆనందంతో
రక్షకుని ఆరాధించండి
మహిలో వెలసినమహోన్నతుని
పూజించగ రండి
చరణం 2:
ఇమ్మానుయేలు దేవుడు
మనతో నిరతం ఉండగా వచ్చాడు
విశ్వాస యాత్రలో మనలను కాపాడి పరమునచేర్చ వచ్చాడు
రండి రారండి ఆనందంతో
రక్షకుని ఆరాధించండి
మహిలో వెలసినమహోన్నతుని
పూజించగ రండి
4.Song
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/2
దీన మనసు కలిగిన వాడు
దైవ చిత్తం పాటించిన వాడు/2
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/2
చరణం1:
పరిశుద్ధతలో బ్రతికినవాడు
తండ్రి దేవునికి ఇష్టమైనవాడు/2
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/2
చరణం2:
కలను సాకారం చేసిన వాడు
మరియను భార్యగా స్వీకరించిన వాడు
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/2
చరణం3:
కష్టములో ఫలించినవాడు
మౌనముగా జీవించిన వాడు/2
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/2
చరణం4:
ప్రభుబాల్యం సంరక్షించిన వాడు
ఆత్మ ప్రేరణలో జీవించిన వాడు/2
నీతిమంతుడు నీతిమంతుడు
యోసేపుగారు నీతిమంతుడు/
5.Song
అంతులేని ప్రేమను మాకు చూపగా
పరమ నుండి దిగివచ్చితివా/2
రక్షకుడా …నీకే ఆరాధన
మా అభిషక్తుడా …నీకే ఆరాధన/2
చరణం1:
మమ్ము చేరగా.. ఈ లోకమునకు వచ్చితివి
తండ్రి కడకు చేర్చగా ..
మమ్ము మార్చితివి/2
నీ మేలులను వివరించగలనా
నీ ప్రేమను వర్ణించగలనా
నా జీవితమంతా నిన్నే నేను సేవించని..
రక్షకుడా …నీకే ఆరాధన
మా అభిషక్తుడా …నీకే ఆరాధన/2
చరణం2:
మమ్ములను రక్షించగా..
నీవు దీనుడవైతివి
నీఆత్మలోజీవించగా.
వాక్యముతో బలపరచితివి
నా గుండెను గుడిగా నీకు మార్చనా
కడవరకు నేను నీకు సాక్షిగా మారనా
రక్షకుడా …నీకే ఆరాధన
మా అభిషక్తుడా …నీకే ఆరాధన/2
6.Song
పిల్లలం మేము చిన్న పిల్లలం
చిన్నారి బాలుని చూడ వచ్చితిమి/2
చరణం 1:
చిరు కానుకలెన్నో తెచ్చితిమి
బాలునికి ఇయ్యగా వచ్చితిమి
పిల్లలం మేము చిన్న పిల్లలం
చిన్నారి బాలుని చూడ వచ్చితిమి/2
చరణం 2:
చిరునవ్వులను చూడవచ్చితిమి
బాలుని ఆరాధించవచ్చితిమి
పిల్లలం మేము చిన్న పిల్లలం
చిన్నారి బాలుని చూడ వచ్చితిమి/2
చరణం 3:
గొప్ప దేవుడని వచ్చితిమి
మము దీవించ కోరగవచ్చితిమి
పిల్లలం మేము చిన్న పిల్లలం
చిన్నారి బాలుని చూడ వచ్చితిమి/2
చరణం 4:
ఆటపాటలాడగా వచ్చితిమి
ఊసులు చెప్పగా వచ్చితిమి
పిల్లలం మేము చిన్న పిల్లలం
చిన్నారి బాలుని చూడ వచ్చితిమి/2
7Song
మనలో దేవుని చూడగా
శాంతినిచ్చె దేవుని
పూజించగా
ప్రణమిల్లి భక్తితో మోకరిల్లుదాం
ఇదియే నిజమైన క్రిస్మస్ పండుగ
ప్రభువు మెచ్చే క్రిస్మస్ పండుగ/2
చరణం1:
విశ్వాసంలో నిరీక్షించుదాం ప్రభు రాకడకై ఎదురుచూసెదాం
ప్రభువాక్కులు ధ్యానించుదాం
అనుదినం ఆత్మలో నడిచెదం
ఇదియే నిజమైన క్రిస్మస్ పండుగ
ప్రభువుమెచ్చే క్రిస్మస్ పండుగ/2
చరణం2:
చీకటి పనులు త్యజించుదము
వెలుగులో పయనించుదాం
ప్రభు ప్రేమలో జీవించుదాం
నీతికార్యములు చేసెదము
ఇదియే నిజమైన క్రిస్మస్ పండుగ
ప్రభువుమెచ్చే క్రిస్మస్ పండుగ/2
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: