CM Revanth Reddy Announces Inclusion of Jaya Jayahe Telangana Song by Andesri in School Textbooks
Автор: Telangana CMO
Загружено: 2025-11-11
Просмотров: 1478
Hon'ble Chief Minister Shri A. Revanth Reddy announced that the song ‘Jaya Jayahe Telangana…’, written by the eminent poet Andesri — who devoted his life to the Telangana movement — will be included as the first lesson in school textbooks.
🔸 The Chief Minister said the proposal will be placed before the Cabinet for approval and assured that the government will take all steps to honour and immortalize Andesri’s contribution to Telangana.
🔸 After attending Andesri Garu’s last rites at Ghatkesar, the Chief Minister appealed to Prime Minister Shri Narendra Modi to confer the Padma Shri Award posthumously on Andesri and urged Union Ministers Shri Kishan Reddy and Shri Bandi Sanjay to take the initiative in this regard.
🔸 Expressing deep grief, he said, “The loss of Andesri Garu, who played a monumental role in the formation of Telangana, is a personal loss for me, my family, and the entire Telangana society.”
🔸 He recalled Andesri’s inspiring role alongside Gaddar Anna, noting that ‘Jaya Jayahe Telangana’ became the voice of the movement and continues to inspire people even after a decade of statehood.
🔸 The Chief Minister said the government will provide employment to one family member, develop a memorial at Andesri Garu’s resting place, and distribute 20,000 copies of his book ‘Nippulavagu’ to government libraries across the state.
🔸 Describing ‘Nippulavagu’ as a “spark of inspiration and a guiding light for Telangana’s youth and activists,” he said the government will take further steps, in consultation with admirers and writers, to preserve Andesri’s legacy for future generations.
🔸 Concluding, the Chief Minister said, “Andesri Garu never spoke about his struggles. He was a great humanitarian who saw the entire community as his family. My heartfelt gratitude to everyone who showed affection and respect for him.”
చివరి శ్వాస వరకు జీవితం సర్వస్వాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన ప్రజాకవి అందెశ్రీ గారు రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.
❇️ రాబోయే మంత్రిమండలి సమావేశంలో మంత్రుల సహకారంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంతో పాటు తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ గారి పేరును శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
❇️ ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ గారి అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి గారు అక్కడ మీడియాతో మాట్లాడారు.
❇️ తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అందెశ్రీ గారికి పద్మశ్మీ అవార్డును అందించి గౌరవించుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేశారు. అందెశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సూచిస్తుందని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా చొరవ తీసుకోవాలని కోరారు.
❇️ “చివరి శ్వాస వరకు తన సర్వం ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీ గారిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి తీరని లోటు. నాకే కాదు యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో బాధాకరం.
❇️ తెలంగాణ విషయంలో వారితో చర్చించిన అనేక విషయాలు నాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందెశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని కలిగించారు. వారు రాసిన జయ జయహే.. గీతం కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని నింపుతోంది.
❇️ అందెశ్రీ గారి ప్రతి మాట, ప్రతి పాట ప్రజా జీవితం నుంచి వచ్చిందే. ప్రతి పాట ఉద్యమ స్ఫూర్తిని నింపింది. జీవితాంతం నిస్వార్థంగా తన రక్తాన్ని చెమటగా మార్చి, తన గళాన్ని తెలంగాణకు అంకితం చేశారు. అలాంటి అందెశ్రీ గారి కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం.
❇️ అందెశ్రీ గారిని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ ఉన్నంత కాలం అందెశ్రీ గారి పాత్రను శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
❇️ వారు చేసిన రచనలకు సంబంధించిన పుస్తకం నిప్పులవాగు పుస్తకం ఒక స్ఫూర్తి. ఒక ప్రజ్వలనం. భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా తెలంగాణ యువతకు, ఉద్యమ కారులకు, సమస్యలపై పోరాటం చేసే వారికి దిక్సూచిలా పనిచేస్తుంది.
❇️ తెలంగాణ సమాజానికి వారి రచనలు అందించే విధంగా నిప్పులవాగు పుస్తకాన్ని 20 వేల ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లైబ్రరీల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటాం. ఇవే కాకుండా అందెశ్రీ గారిని అభిమానించే వారందరి సూచనలు తీసుకుని వారి పేరు శాశ్వతంగా, పదిలంగా ఉండటానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది.
❇️ అందెశ్రీ గారు ఏనాడూ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచన చేయలేదు. సమాజమే తన కుటుంబంగా భావించిన గొప్ప మానవతా వాది. అందెశ్రీ గారి పట్ల అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
#Telangana #CMRevanthReddy #Andesri #Poet #Writer #AndeYellanna #RevanthReddy #TelanganaLiterature #JayaJayaheTelangana #Ghatkesar #Hyderabad #DuddillaSridharBabu #JupallyKrishnaRao #Seethakka #PonnamPrabhakar #AdluriLaxmanKumar #MaheshKumarGoud
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: