ఆదోని ప్రజల అమాయకత్వను ఆసరా చేసుకొని ఆడుకున్న రాజకీయ నేతలు...... ఆదోని జిల్లా చేయకుండా నీరు కార్చిన
Автор: BRSNEWS
Загружено: 2025-12-31
Просмотров: 366
...ఆదోని ప్రజల అమాయకత్వను ఆసరా చేసుకొని ఆడుకున్న రాజకీయ నేతలు...
... ఆదోని జిల్లా చేయకుండా నీరు కార్చిన రాజకీయ నేతలకు.. బుద్ధి చెప్పాలి
ఆదోని జిల్లా కోసం ప్రజలు 45 రోజులుగా పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం స్థానిక రాజకీయ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించి ఇళ్లలో ఉండిపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అలాగే ఆదోని అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వం ఆదోనిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కర్నూలులో గ్రేటర్ కర్నూలుగా చేయటానికి ఆదోని డివిజన్లో కూడాలో కలిపివేయడం చాలా దారుణమని సీనియర్ జర్నలిస్టు, ప్రజాస్వామ్య జర్నలిస్ట్ యూనియన్ సలహాదారుడు తెలుగు ఈరన్న తీవ్రగా విమర్శించారు. గ్రేటర్ కర్నూల్ ను చేయడానికి ఆదోని డివిజన్లో కర్నూలు అభివృద్ధి బోర్డులో కలపడం చూస్తుంటే ఆదోని డివిజన్లో జిల్లా చేయకుండా కర్నూలులో ఉన్నటువంటి నాయకులు అడ్డుపడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఆదోని లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇంట్లో సూట్ కేసులు నింపుకోవడానికి మాత్రమే ఉన్నారు తప్ప ఆదోని డివిజన్ ను కూడా లో కలుపుతున్న కిమ్మనకుండా ఉండటం వారి రాజకీయ అనుభవ రాహిత్యానికి ఒక ఉదాహరణ అని విమర్శించారు. 45 రోజులుగా నిరాహార దీక్షలు బంధువులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారు స్పష్టం చేశారు. జిల్లాను చేయడానికి ఏ రాజకీయ నాయకుడికి ఇష్టం లేదని ప్రజలే జిల్లాను చేయడానికి ఉద్యమించాలని కోరారు. రైతు సంఘం నాయకుడు మేఘనాథ్, సాంస్కృతిక సంఘం నాయకులు మల్లారెడ్డి, కళాకారులు ప్రతాప్ స్వామి, వైకుంఠ స్వామి, లక్ష్మయ్య, తబలా లక్ష్మన్న, చిగిలి రామచంద్ర, కమ్మ వీరేష్, సింగ్ భాయ్, బలరాం సింగ్, టీచర్ రంగన్న, సవరప్ప, గంగాభవాని దేవాలయమ అర్చకులు సత్యనారాయణ స్వామి తదితరులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: