O NINDU CHANDAMAMA--BANGARU TIMMARAJU-K.J. YESUDAS-( VIDEO CREATED, NOT ORIGINAL) ఓ! నిండు చందమామా
Автор: Charepalli RK Music Channel
Загружено: 2021-07-27
Просмотров: 200166
DEAR VIEWRS TO BE HONEST ORIGINAL VIDEO IS NOT AVILABLE,THIS IS JUST CREATED TO SUIT THE MOODS OF SUCH A BEAUTIFUL SONG.HOPE YOU ENJOY THIS EFFORT-CHAREPALLI RK- Music: Kodandapani SP; Singer: KJ. Yesudas; Lyricist: Arudra. Oh Nindu Chandamama
అందుబాటులో బంగారు తిమ్మరాజు -K.J. ఏసుదాస్ గారి ఈ పాట వీడియో లేదు.ఓ అద్భుతమైన ఈ పాటకు వీడియో చేసే ప్రయత్నం ఓ సాహసమేమో !.జయం మనదే చిత్రం లోని రెండు పాటల వీడియోల సహాయంతో ఈ పాట చేయడం జరిగింది అని సవినయంగా తెలియచేస్తున్నాను.చూసి ఆనందించగలరు.(జయం మనదే చిత్రం లోని ఆ రెండు పాటలు ఏవో ప్రేక్షకులు కనుగొనగలరా ?)
LYRICS
ఓ నిండు చందమామా ... నిగనిగలా భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ... నిండు చందమామా
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓ ... నిండు చందమామా ... నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ... నిండు చందమామా
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే
ఓ ... నిండు చందమామా ... నిగనిగలా భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: