రామ రఘురామ లాలీ | RAMA RAGHURAMA LALI
Автор: RK Bhakti Ranjani
Загружено: 2024-04-25
Просмотров: 57857
SAMPRADAYA LALI PATA
సాంప్రదాయ లాలిపాట
రామ రఘురామ లాలీ - మాపాలి సీతా సమేత లాలీ
రఘురామ రామ లాలీ - అనియిట్లు జనులు పాడేరు లాలీ || రామ రఘురామ||
కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
దేవకీ గర్భముననూ కృష్ణావతారమై జన్మించెను || రామ రఘురామ||
తలతోటి జన్మమైతే తనకు బహు మోసము వచ్చుననుచు
ఎదురుకాళ్లను పుట్టెను - ఏడుగురు దాదులను తా జంపెనూ.. || రామ రఘురామ||
నవనీత చోరుడమ్మా - ఈ బిడ్డ నందగోపాలుడమ్మా
సితపత్ర నేత్రుడమ్మా - ఈబిడ్డ శ్రీరామ చంద్రుడమ్మా || రామ రఘురామ||
నెత్తుఱై ఉండి చాలా - తానపుడు క్యావు క్యావున ఏడ్చెను
నన్నెలా ఎత్తుకోవే - ఓతల్లీ కన్నతల్లె త్తుకోవే || రామ రఘురామ||
నిన్నెట్లు ఎత్తుకొందు - నీవొక్క నిమిషమ్ము పవళింపరా
అల్లదిగొ "బూచివాడు" వస్తాడు నాతండ్రి పవళించరా || రామ రఘురామ||
"బూచేల వచ్చునమ్మా" ?? ఓ తల్లి బూచేల వచ్చునమ్మా ??
బూచేల వచ్చునమ్మా ఓ తల్లి "బుద్ధిమంతుడ" నే..నమా || రామ రఘురామ||
నిన్నెట్లు ఎత్తుకొందు - నీవొక్క నిమిషమ్ము పవళింపరా
అల్లదిగొ "జోగివాడు" వస్తాడు - నాతండ్రి పవళించరా
"జోగేల" వచ్చునమ్మా - ఓతల్లి జోగేల వచ్చునమ్మా
"జోగి మందుల సంచులు" ఈవేళ నాచెంతనుండగాను || రామ రఘురామ||
నిన్నెట్లు ఎత్తుకొందు - నీవొక్క నిమిషమ్ము పవళింపరా
అల్లదిగొ "పాము వచ్చే" నీవొక్క నిమిషమ్ము పవళించరా
"పామేల" వచ్చునమ్మా ?? ఓతల్లి "పామేల" వచ్చునమ్మా
"పాము" నా క్రిందనమ్మా - శేషుడై పవళించి యుండెనమ్మా || రామ రఘురామ||
నిన్నెట్లు ఎత్తుకొందు - నీవొక్క నిమిషమ్ము పవళింపరా
"నీమామ" కంసుడూను - ఇమ్మని అడగ వస్తాడు తండ్రీ
నామామ కంసుడూను - ఇమ్మని అడగ వస్తేను తల్లీ
చేతులతొ అందివ్వవే - దూరముగ నిలుచుండి చూడమ్మా || రామ రఘురామ||
నీ యిల్లు నీలగట్ట - నీనోట బెల్లమ్ము గడ్డకొట్టా
నీ యింట సిరులుపుట్టా - చీమలై చుట్టాలు చుట్టుముట్టా
రామయ్య వంటి తండ్రి - అచ్చముగ సీతమ్మ వంటి తల్లి
లక్ష్మణుడు నేనుండగా నాతండ్రి నీకింక లోటేమిరా || రామ రఘురామ||
ఏలాటి కరుణ నీది – నాయన్న- నీసాటి దైవమేదీ
నాబోటి దీన ఏదీ -నా తండ్రి - అభయమిడి కాపాడుమా
కస్తూరి రంగ రంగ - చిన్నారి - కావేటి రంగ రంగ
బంగారు ముద్దుకొండ బజ్జోర నీకడుపు చల్లగుండా || రామ రఘురామ||
శుభం భూయాత్ #
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: