Nindaleni Pathi - Annamayya Sankeerthana (నిందలేని పతి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Автор: Bijjam Brothers
Загружено: 2025-10-26
Просмотров: 572
నిందలేని పతి - అన్నమయ్య సంకీర్తన (Nindaleni Pathi - Annamayya Sankeerthana)
Singer - Charumathi Pallavi garu; Composer - Sai Madhukar garu during Annamayya Paataku Pattabhishekam Program by SVBC & TTD
Ragam - Hamsadwani
Lyrics -
నిందలేని పతి విదె నీవు నాసొమ్ము
కందువ సొమ్ములమీఁదఁ గలిగెను సొమ్ము
సూటిగా నీవు చూచేటి చూపు నాసొమ్ము
పాటించి నీవు పలికేపలుకు నాసొమ్ము
కూటమిరతుల కొనగోరు నాసొమ్ము
యీటున నీమేనిసొమ్ము లిచ్చేవు నాకు
చవిగా నాడే నీ సరసము నాసొమ్ము
జవకట్టక యిచ్చే నీచనవు నాసొమ్ము
నవకమయిన నీనవ్వు నాసొమ్ము
యివల నింకా సొమ్ము లిచ్చేవు నాకు
కింకలేని దిదే నీకాఁగిలి నాసొమ్ము
లంకెలైన నీమతివలపు నాసొమ్ము
అంకెల శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యింకా సొమ్ము లిచ్చేవు యెన్నియైనా నీవు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: