నర్సీపట్నంలో రౌడీ షీటర్ల వీరంగం,అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి విధ్వంసం,వాహనాలుధ్వంసం|Rowdy Gang|Police
Автор: MY3NEWSTELUGU
Загружено: 2025-01-30
Просмотров: 3185
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, మూడు బైకులు తగలబెట్టి,రెండు ఆటోలు మూడు అంబులెన్స్ ల అద్దాలు పగులగొట్టిన రౌడీ షీటర్ తన అనుచరులు
#viralnews #my3newsap #news #trending #trendingviralvideo #ytshorts
అలజడి సృష్టించిన పాతనేరస్తుడి వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రీనివాస్
నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ గురువారం
విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ
28వతేది మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయం లో నర్సీపట్నం SC కాలనీలో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అదే కాలనీకి చెందిన పాత నేరస్తుడు అయిన రౌతు మల్లేష్ తన ఇద్దరి కుమారులైన రౌతు కుమార్ కరుణాకర్, రౌతు సాయికిరణ్ , కేత సాయి, కేత తారక్ తో పాటు మరికొంత మంది అక్కడే మందు తాగుతూ విగ్రహం కళ్లద్దాలను డ్యామేజ్ చేయడంజరిగిందన్నారు. అక్కడే ఉన్నటువంటి గారా దుర్గాప్రసాద్ మరియు మరా లోవరాజు తోపాటు మరికొంతమంది ఆ విషయం గురించి మల్లేష్ ని అడగగా నువ్వు ఎవడోవు అడగడానికి అని తన పైన బండ బూతులు తిడుతూ కత్తులతో బెదిరించి వారితో గొడవపడ్డారన్నారు. అదే సమయంలో ఎస్సీ కాలనీలో పవర్ కట్ అయిందని ఫిర్యాదు పై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు చెందిన జూనియర్ లైన్మెన్ మరియు షిఫ్ట్ ఆపరేటర్ వచ్చి తమ విధులను నిర్వర్తిస్తుండగా వారి పైన కూడా తిరగబడి దౌర్జన్యం చేసి చేతులతో కాలుతో తన్ని కత్తులతో బెదిరించడంతో ఈ విషయం పైన పోలీస్ వారికి తెలియపరచగా టౌన్ సీఐ గోవిందరావు కు సమాచారం ఇచ్చారన్నారు. సీఐ ఇద్దరు ఎస్ఐలు మరియు సిబ్బందితో అక్కడికి వెళ్లడం జరిగిందని, అక్కడే ఉన్నటువంటి మల్లేసు మరియు వారి మనుషులు పోలీసులను చూసి కత్తులు, కర్రలు ఊపుకొని పెద్ద పెద్ద కేకలు వేస్తూ తన ఇంటి వైపు పరుగు పరుగున వెళ్లిపోయారని తెలిపారు. ఆ తర్వాత రౌతు మల్లేష్ ఇంటి వెనుక భాగం నుండి వాళ్లు గారా దుర్గాప్రసాద్ ఇంటి వైపు వెళ్లి అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రశ్నించారని ఉద్దేశంతో కక్షగట్టుకొని అక్కడ ఉన్నటువంటి రెండు స్కూటీలను పెట్రోల్ పోసి తగలబెట్టి ,దుర్గాప్రసాద్ ఇంటిలోని ప్రవేశించి ఇంట్లో ఉన్న మంచం, సోఫా సెట్ పై పెట్రోల్ పోసి కాల్చి వేశరన్నారు. ఆ తర్వాత ప్రైవేట్ అంబులెన్స్ పార్కింగ్ చేసిన ప్రదేశానికి వెళ్లి మూడు అంబులెన్సులు యొక్క అద్దాలను పగలగొట్టి ,అక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఒక బుల్లెట్ ను కూడా పెట్రోల్ పోసి కాల్చివేసి, పోలీసులు చూసి పారిపోయారన్నారు. వీటి పైన ఉన్నతాధికారులకు తెలియపరిచి ఇచ్చిన రిపోర్టుల పై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని,అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండుట గాను తగిన ఏర్పాటు చేయడం జరిగింది. పై మూడు కేసులలో ఉన్నటువంటి ముద్దాయిలను పట్టుకోవడానికి టీములు గా ఏర్పాటు చేసినాము వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: