chamadumpala fry
Автор: My Hungry Spoon
Загружено: 2025-09-15
Просмотров: 131
@MyHungrySpoon
చమదుంప వేపుడు తయారీ విధానం (Chamadumpa Fry Recipe in Telugu)
కావలసిన పదార్థాలు:
చమదుంపలు (Taro root) – 1Kg
నూనె – 5 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – ½ టీస్పూన్
కరివేపాకు – కొన్ని రెమ్మలు
పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి – 4 (అరుక్కోవాలి)
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – ¼ టీస్పూన్
కారం – 1 టీస్పూన్ (అలాగే రుచికి తగినంత)
సెనగ పిండి - 4 టీ స్పూన్లు
తయారీ విధానం:
చమదుంపల ఉడకబెట్టడం:
ముందుగా చమదుంపలను శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్‌లో 1-2 విజిల్స్ వచ్చేలా ఉడికించండి.
ఎక్కువ ఉడకకుండా చూసుకోవాలి, లేదంటే కడియంగా తయారవుతాయి.
ఉడికిన తరువాత చల్లారనివ్వండి, తరువాత తొక్క తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేయండి.
వేపే ప్రక్రియ:
ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయండి.
అందులో ఆవాలు, జీలకర్ర వేసి తరిగిన పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేపండి.
ఇప్పుడు చమదుంప ముక్కలు వేసి కలపండి.
పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపండి.
మద్య మద్యలో కలుపుతూ మధ్యస్థ మంటపై 10-15 నిమిషాల పాటు వేయించండి.
చివరగా సెనగ పిండి పొడి చల్లి బాగా కలిపితే రుచి మరింత పెరుగుతుంది.
చిట్కాలు:
చమదుంపలు ఉడికిన వెంటనే చల్లగా నీటిలో వేసి ఉంచితే తొక్క తేలికగా తీసేయవచ్చు.
కొంచెం లేత క్రిస్పీగా కావాలంటే చివర్లో కొద్దిగా నూనె స్ప్రింకిల్ చేసి ఉంచండి.
ఇలాచేస్తే ఈ వేపుడు బయట హోటళ్లలో లభించే రుచితో సమానంగా ఉంటుంది.
ఈ చమదుంప ఫ్రైని వేడి వేడిగా ప్లెయిన్ రైస్, పప్పు లేదా సాంబార్ తో వడ్డిస్తే బాగుంటుంది......!!!!!
Chamadumpa Fry Recipe (Taro Root Fry)
Ingredients:
Taro roots (Chamadumpalu) – 250 grams
Oil – 2 tablespoons
Cumin seeds – ½ teaspoon
Curry leaves – a few sprigs
Green chilies or dried red chilies – 2 (slit or broken)
Salt – to taste
Turmeric powder – ¼ teaspoon
Red chili powder – 1 teaspoon (adjust to taste)
Chana powder – 4 teaspoon (optional)
Preparation Method:
Boiling the Taro:
Wash the taro roots thoroughly.
Pressure cook them for 1–2 whistles (do not overcook).
Let them cool down completely.
Peel the skin and cut them into medium-sized round or cube pieces.
Frying Process:
Heat oil in a pan.
Add mustard seeds, cumin seeds, green/red chilies, and curry leaves. Let them splutter.
Add the chopped taro pieces and sauté.
Sprinkle turmeric, salt, and red chili powder. Mix well.
Cook on medium flame for 10–15 minutes, stirring occasionally, until the pieces become slightly crispy and golden.
Optionally, sprinkle Chana powder towards the end and mix.
Tips:
After boiling, you can place the taro in cold water to make peeling easier.
For extra crispiness, you can shallow fry with a bit more oil or air-fry the boiled pieces before tempering.
Avoid overcooking the taro in the pressure cooker, or it may become mushy during frying.
This Chamadumpa Fry is best served hot with plain rice, dal, or sambar.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: