patriotic song deshabhakthi geetham గగన వీధిలో రెపరెపలాడే జెండా నంది శ్రీనివాస్ telugudalam
Автор: Telugu Dalam
Загружено: 2024-08-14
Просмотров: 85418
గగన వీధిలో రెపరెపలాడే జెండా అదిగో జయజయహో
తనలాగే నిను తలెత్తుకొమ్మని పిలుస్తున్నది జయజయహో...
ఎవరికి వారే ఏకాకుల్లా విడిపోతుంటే పడిపోతారని
కలిసి కట్టుగా గడ్డిపరకలే మత్తగజాన్నే బంధిస్తాయని
తన వీరగాధనే గుణపాఠంగా వినిపిస్తున్నది జయజయహో
పోరుదారిలో పొగరుగ నిలిచిన జెండా మనదే జయజయహో
||గగన వీధిలో||
నేనూ నాదీ నా ఇల్లంటూ
ఎందాకా గిరిగీసుకుంటవు
దేశమొసగిన దేహం నీదని
దేశమాతకే సమర్పణమ్మని
కాషాయంతో కవాతు చేసే జెండా అదిగో జయజయహో
త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనదే జయజయహో
||గగన వీధిలో||
చీకటి ముసిరిన ముళ్లదారిలో
దిక్కే తెలియని చిక్కుల వలలో
తొవ్వ తెలువదని బెంగటిల్లకు
నువ్వే వెలుగై సాగిపొమ్మని
తెలుపు రంగుతో తెలుపుతున్నది జెండా అదిగో జయజయహో
శాంతి కాంతినే పంచమన్న ఆ జెండా మనదే
జయజయహో
||గగన వీధిలో||
కొమ్మవు నీవై రెమ్మవు నీవై
పరిమళాల సుమగంధం నీవై
పందిరి నీవై పండువు నీవై
పక్షులు వాలే చెట్టువు నీవై
పచ్చటాకులా ఆదర్శాన్ని పంచుతున్నది జయజయహో
పరోపకారిగ బతకమన్న ఆ జెండా మనదే జయజయహో
||గగన వీధిలో||
..
......... నంది శ్రీనివాస్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: