శ్రీనాథుడు చెప్పిన ఘట్టకుటికా ప్రభాత న్యాయం | శృంగార నైషధం | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2025-07-17
Просмотров: 14175
ఈరోజు మనం ముందుగా ఘట్టకుటీ ప్రభాతన్యాయం గురించి చెప్పుకుందాం. ఆపై శ్రీనాథ మహాకవి ఆ న్యాయాన్ని తన శృంగార నైషధం కావ్యంలో ఎంతో అందంగా అమర్చినటువంటి ఒక పద్యాన్ని కూడా చెప్పుకుందాం.
ఈ ఘట్టకుటీ ప్రభాత న్యాయము అనేది చాలా ప్రసిద్ధి చెందిన సంస్కృత న్యాయం. దీనినే ఘట్టకుటీకా ప్రభాత న్యాయం అని కూడా అంటారు. న్యాయము అంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మన జీవితంలో చాలా సందర్భాలకు అన్వయం అయ్యేలా ఒక సూత్రప్రాయంగా చెప్పడం. స్థాలీపులాక న్యాయం, కాకతాళీయన్యాయం, మర్కట కిశోర న్యాయం, మార్దాల కిశోర న్యాయం మొదలైన న్యాయాల గురించి కూడా మనం మన అజగవలో ఇదివరలో చెప్పుకున్నాం. ఉదాహరణకు స్థాలీపులాకంలో స్థాలీ అంటే కుండ. పులాకం అంటే మెతుకు. కుండలో అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తాం. అలానే ఒక మనిషిని అతని మాటల్ని బట్టి, ఒక పుస్తకాన్ని ఒక పేజీ చదివీ అంచనా వెయ్యవచ్చు అని చెప్పే సందర్భాలలో ఈ న్యాయాన్ని వాడాతారు. అలానే మిగిలిన న్యాయాలు కూడా. అటువంటి న్యాయములలో ఒకటైన ఘట్టకుటీ ప్రభాత న్యాయం గురించి ఈరోజు చెప్పుకుందాం. కేవలం న్యాయం గురించే కాకుండా ఆ న్యాయాన్ని శ్రీనాథుడంతటి మహాకవి తన రచనలో ఉపయోగించిన తీరును కూడా చెప్పుకుందాం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: