ఈశావాస్య ఉపనిషత్తులో ఏముంది? | Ishavasya Upanishad | Rajan PTSK |ఈశావాస్యోపనిషత్తు
Автор: Ajagava
Загружено: 2024-08-09
Просмотров: 6640
సనాతన ధర్మం - వేద వాఙ్మయ పరిచయం
సనాతన ధర్మానికి వేదమే మూలం. ఆ వేదం కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అని మూడు భాగాలుగా ఉంటుంది. చివరిదైన ఆ జ్ఞానకాండే వేదాంతంగా ఉపనిషత్తుల రూపంలో ఉంది. కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతకైనా, వ్యాస భగవానుడు వ్రాసిన బ్రహ్మసూత్రాలకైనా ఈ ఉపనిషత్తులే ఆధారం. జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ప్రధానమైన పది ఉపనిషత్తులకు భాష్యం వ్రాశారు. ఆ పది ఉపనిషత్తులను గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం ఉంది. అది.. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః - ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఈశావాస్యోపనిషత్తు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఇవీ ఆ పది ఉపనిషత్తులు. వీటిలో మొదటిదైన ఈశావాస్యోపనిషత్తు గురించి ఈరోజు సంగ్రహంగా చెప్పుకుందాం. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. వేదవాంఙ్మయ పరిచయంలో భాగంగా నేనీ ఉపనిషత్తులను పరిచయం చేస్తున్నాను తప్ప. వాటిలో చెప్పబడ్డ బ్రహ్మవిద్యను బోధించే శక్తి నాకు లేదు. ఉపనిషత్తులన్నవి జ్ఞానభాండాగారాలు. వాటిలో చెప్పబడ్డ విషయాలను సద్గువురుల ద్వారానే నేర్చుకోవాలి. కేవలం టీకా తాత్పర్యాలతో చదువుకోవడం ద్వారానో, చిన్నపాటి వ్యాఖ్యానాలు వినడం ద్వారానో మనం వాటిని పూర్తిగా అవగతం చేసుకోలేం. అసలు ఉపనిషత్ అన్న మాటకు అజ్ఞానాన్ని పోగొట్టే బ్రహ్మవిద్య, భగవంతునికి సమీపంగా తీసుకువెళ్లేది అన్న అర్థాలతో పాటూ, గురువుకు సమీపంలో కూర్చుని జ్ఞానాన్ని సంపాదించుట అన్న అర్థం కూడా ఉంది. అందుకే సద్గురువు ద్వారా మాత్రమే మనం ఉపనిషత్తులు అందించే నిజమైన జ్ఞానాన్ని పొందగలం. అయితే అసలు ఏ ఉపనిషత్తు దేని గురించి చెబుతోందన్న కనీస అవగానైనా ప్రతీ సనాతన ధర్మవీరుడికీ ఉండాలన్న సదాశయంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈశావాస్యోపనిషత్తులోకి ప్రవేశిద్దాం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: