komala gaanam

జయసింహ చిత్రంలో ఈనాటి ఈ హాయి పాట వరుస
రచన. ఏఎస్ దేముళ్ళు
పెద బొడ్డేపల్లి. నర్సీపట్నం మండలం విశాఖపట్నం.

శ్రీ ఆంజనేయ ప్రభో
ఇటు రావోయి హనుమ ప్రభో.

వీరాధివీరా రణరంగ ధీర
విను తింతు హనుమంతా
నీ కోరితో యిఈ నీ రాక నోయి
ఓ మారు రావోయి ఓ మారుతి.

శ్రీ రామ ప్రేమ నీ హృదయ సీమ
ఏలేటి ఓ హనుమా
నీ నామ మహిమ వర్ణింప వశమా
నా పాలి భాగ్యము నీవే సుమా.

నీ దివ్య మంత్రం నీ నామ భజన
నాకెంతో ఆనందం
నిను కొలుచు ఫలము కలిగించు బల ము
ప్రతి దినము గావించు ఆరాధనం.

నన్నేలు స్వామి సర్వాంతర్యామి
కనిపించ రావేమి
శిరసానమామి మనసాస్మరామి
శ్రీరామ పూజారి రావా దారి.